- మల్కాజిగిరి సీఐ సత్యనారాయణ
పత్రికా రంగంలో పేరుగాంచిన ప్రముఖ దినపత్రిక ఆదాబ్ హైదరాబాద్ వార్షిక క్యాలెండర్‌ను మంగళవారం మల్కాజిగిరి సీఐ సత్యనారాయణ , ఎస్సై సునీల్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో పత్రిక రంగం నాలుగో స్తంభంగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వానికి, ఇతర సంస్థలకు జవాబుదారీతనం కల్పించే శక్తివంతమైన, స్వతంత్ర విభాగంగా మీడియా నిలుస్తుందని పేర్కొన్నారు.
14 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి, మల్కాజిగిరి విలేఖరి కుమ్మరి రాజుకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై సునీల్ కుమార్‌తో పాటు ఆదాబ్ హైదరాబాద్ మల్కాజిగిరి విలేఖరి కుమ్మరి రాజు,తుపాకుల రమేష్ ,పాల్గొన్నారు.
- Advertisement -
