తీవ్రంగా ఆరోపించిన మాజీ మంత్రి హరీష్ రావు
- రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ సీఎం..!
- ఆరు గ్యారెంటీలు పక్కనబెట్టి వాటాలకోసం కొట్టుకుంటున్నారు..
- నైనీ బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణ జరిపించాలి..
- అక్రమార్కులపై ఎందుకు చర్యలు తీసుకోరు..?
- పోలీస్ అధికారులను సూటిగా ప్రశ్నించిన హరీష్ రావు..
నైనీ బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణకు ఆదేశించాలని బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. భాజపా, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విÖడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీలను పక్కన పెట్టి, వాటాల కోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఔట్ సోర్సింగ్ సీఎంకు.. అసలైన కాంగ్రెస్ వాదులకు మధ్య వార్ నడుస్తోందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై హరీశ్‌రావు నిప్ప్పులు చెరిగారు. వ్యాపారులను తుపాకులతో బెదిరించి, కవిÖషన్లు వసూలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె చెప్పిందని గుర్తుచేశారు.
సీఎం సన్నిహితుడు రోహిన్ రెడ్డి బెదిరించాడని మంత్రి కుమార్తె చెప్పిందని తెలిపారు. అలంపూర్‌లో రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఏఐసీసీ నేత ఎమ్మెల్యే సంపత్ కుమార్ రూ.8 కోట్లు కావాలని కాంట్రాక్టర్లను బెదిరించాడని తెలిపారు. ఈ ఘటనపై స్వయం గా కాంట్రాక్టరే వచ్చి ఫిర్యాదు చేశాడని.. అయినా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. దీనిపై సిట్ ఏది..? అని నిలదీశారు. జర్నలిస్టులను వేధించడానికి సిట్లు, బీఆరఎస్ పార్టీ నాయకులను వేధించడానికి సిట్లు, కమిషన్లు ఏర్పాటు చేస్తున్నారని.. మరి సంపత్ విÖద సిట్ ఉండదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఖాకీ బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పారు కదా..
ఇప్ప్పుడు ఏమైందని డీజీపీ శివధర్ రెడ్డిని ప్రశ్నించారు. విÖరు ఖాకీ బుక్‌ను కాకి ఎత్తుకుపోయిందా అని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులను బెదిరించిన సీపీ సజ్జనార్ రూల్ బుక్ ఏమైందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి తెల్వకుండా సిట్ వచ్చిందని చెబుతున్నారని హరీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డికి తెల్వకుండా సిట్ వస్తే ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినట్లే కదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి తెలియకుండా సిట్ ఎలా వస్తుందని నిలదీశారు. రాష్ట్ర అడ్మినిస్టేట్రర్ అయిన సీఎం ఏం చేస్తున్నాడని అడిగారు. ఇకపోతే బీ.ఆర్.ఎస్. జెండాలను కూల్చాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. బిడ్డా రేవంత్.. బీ.ఆర్.ఎస్. జెండా గద్దెల జోలికొస్తే..
నీ గద్దె కూలడం ఖాయం, జాగ్రత్త అని హెచ్చరించారు. బీ.ఆర్.ఎస్. గద్దెలను కూల్చితే దుమ్ము.. దుమ్ము అయిపోతావ్ అని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీ.ఆర్.ఎస్. అని తెలిపారు. హౌలా మాటలు బంద్ పెట్టి.. ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని హితవు పలికారు.కేబినెట్లో రైతుబంధు, ఎరువులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ జరగలేదని హరీశ్‌రావు తెలిపారు. 20 లక్షల విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆటలాడుకుంటున్నాడని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ అప్పటి సీఎం అంజయ్యను అవమానించారని, ఆ అవమానంతోనే టీడీపీ ఆవిర్భవించిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ భూస్థాపితం కావాలనే టీడీపీని నెలకొల్పారని తెలిపారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్టీఆర్ పోరాడాడని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు మనశ్శాంతి కలగాలంటే కాంగ్రెస్ భూస్థాపితం కావాలన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదనే స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి టీడీపీ గురించి మాట్లాడుతున్నాడంటే బీజేపీతో అక్రమ సంబంధం ఉన్నట్టే కదా అని ప్రశ్నించారు.
