Tuesday, March 3, 2026
Homeహైదరాబాద్‌Drainage | వారం రోజులుగా పొంగిపొర్లుతున్న డ్రైనేజీ

Drainage | వారం రోజులుగా పొంగిపొర్లుతున్న డ్రైనేజీ

  • తార్నాక–లాలాపేట్ ప్రధాన రోడ్డుపై ప్రజలు, వాహనదారుల అగచాట్లు
  • డ్రైనేజీ నీటితో నిండిన రహదారి, వాటర్ వర్క్స్,జిహెచ్ఎంసి,ట్రాఫిక్ పోలీసుల జాడేది
  • వాహనదారులకు శాపంగా మారిన రోడ్డు నిర్మాణం పనులు

లాలాపేట్–తార్నాక ప్రధాన రోడ్డుపై గత మూడు రోజులుగా డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతుండటంతో వాహనదారులు,స్థానిక ప్రజలు,వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ రోడ్డు మార్గం తార్నాక నుంచి ఈసీఐఎల్, కుషాయిగూడ, నాగారం,కీసర వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రధాన రవాణా మార్గంగా ఉండటంతో సమస్య మరింత తీవ్రమైంది.ప్రధాన రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగునీటిని అరికట్టేందుకు జిహెచ్ఎంసి అధికారులు, వాటర్ వర్క్స్,అధికారులు,సిబ్బంది ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో తార్నాక–లాలాపేట్ ప్రధాన రోడ్డుపై ఇరువైపులా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటం గమనార్హం.రోడ్డు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టడం వల్ల డ్రైనేజీ పైపులైన్లు,మంచినీటి పైపులైన్లు భారీగా డ్యామేజీ అయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మురుగునీరు వెళ్లేందుకు సరైన మార్గం లేక రోడ్డుపైనే ప్రవహిస్తుండటం ఈ సమస్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.అదేవిధంగా,నిరంతరం రోడ్డు పనులు కొనసాగుతుండటంతో ఈ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.

- Advertisement -

అయినప్పటికీ ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ఎక్కడా కనిపించకపోవడం వాహనదారుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.వాహనదారులు స్వయంగా ట్రాఫిక్‌ను ఛేదించుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఎంతో సమయం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు,ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్పందించి తార్నాక–ఈసీఐఎల్ ప్రధాన రోడ్డుపై డ్రైనేజీ సమస్యతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News