కళ్లు ఆరోగ్యంగా(Healthy) ఉండాలంటే పలు జాగ్రత్తలు(Care) పాటించాలి. కళ్లను ఎక్కువగా వాడకూడదు. కళ్లతో ఒకే పనిని ఎక్కువ సేపు చేయటం వల్ల ఒత్తిడి (Stress)కి గురై అసౌకర్యం(Inconvenience) అనిపిస్తుంది. ఈ ఇబ్బంది తలెత్తకుండా ఉండాలంటే మధ్య మధ్యలో కొద్దిసేపు కళ్లు మూసుకోవాలి. తద్వారా వాటికి రెస్ట్(Rest) ఇవ్వాలి. గాలి ఎక్కువగా కళ్లకు తగలకుండా చూసుకోవాలి. కళ్లల్లో దుమ్మూధూళి, పొగ(Fog) వంటివి పడకుండా కేర్‌ఫుల్‌గా ఉండాలి. పిల్లలు ఫోన్ (Phone), టీవీ(TV), కంప్యూటర్(Computer) వంటివి ఎక్కువ సేపు చూడకుండా పేరెంట్స్(Parents) అప్రమత్తంగా ఉండాలి. ఆఫ్‌లైన్ గేమ్స్(Offline Games)ను ఎక్కువగా ఆడించాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే కూలింగ్ గ్లాస్‌లు పెట్టుకుంటే మంచిది. వేడి గాలులు నేరుగా కళ్లకు తగలకుండా ఉంటాయి. కళ్లల్లో ఏమైనా సమస్య ఉన్నప్పుడు వెంటనే వైద్యుణ్ని కలవటం బెటర్. రాత్రి త్వరగా నిద్రపోవాలి. ఫోన్ చూసుకుంటూ లేట్ నైట్ పడుకుంటే కళ్ల మీద ప్రభావం పడుతుంది. ఫుడ్ కూడా మంచిది తీసుకోవాలి. క్యారెట్ల లాంటి కళ్లకు ఆరోగ్యకరమైనవాటిని తినాలి.
