అలిశెట్టి ప్రభాకర్.. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో 1956 జనవరి 12న జన్మించారు. ఆయనకు ఏడుగురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములు. తండ్రి పరిశ్రమల శాఖలో పనిచేస్తూ మృత్యువాతపడ్డారు. దీంతో.. అలిశెట్టి.. 11 ఏళ్ల వయసులోనే కుటుంబ భారం మీద పడి ఫొటోగ్రాఫర్(Photographer)గా మారారు. బతుకు దెరువు కోసం హైద్రాబాద్ వచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రికలో సిటీ లైఫ్(City Life) అనే శీర్షికన నగరంలోని ప్రజల జీవితాలపై తనదైన శైలిలో స్పందించారు. క్షయ వ్యాధి(Tuberculosis-TB) బారినపడి 1993 జనవరి 12న చనిపోయారు. ఇలా.. జననం, మరణం ఒకే రోజు వచ్చిన అరుదైన వ్యక్తుల్లో అలశెట్టి ఒకరు.
దీప్తి ఎర్ర పావురాలు, పరిష్కారం వంటి కవితా సంపుటాలను రాశారు. కలంతో కవాతు చేసి రాశి కన్నా వాసి మిన్న అని చాటిన సాహితీ వీరుడు(Literary Hero). ఎంతకాలం బతికాం అన్నది కాదు.. సమాజం(Society) కోసం ఎంత పనిచేశాం అన్నదే ముఖ్యమని నిరూపించారు. తనువు పుండై.. తాను పండై.. తాను శవమై.. వేరొకరి వశమై.. తను ఎడారై.. ఎందరికో ఒయాసిస్సై.. అని వ్యభిచారుల దీన స్థితిపై పదునైన అక్షరాలతో ప్రాముఖ్యత పొందారు. యువత గురించి చెబుతూ.. శిల్పం చెక్కక ముందు బండరాయి, బండ శిల్పంగా మారిన తర్వాత విలువ పెరుగుతుంది అని అన్నారు.
స్వయంకృషితో ఎదుగాలని సూచించిన అలిశెట్టి ప్రభాకర్ కవిత అద్భుతం. ‘జీవించడానికి, జీవితానికి చాలా తేడా ఉంది’ అంటారు. ‘అంగుళం కదలకుండా ఉండే శవం కాదు.. ప్రతిక్షణం చలనమైంది జీవితం’ అని రాశారు. తెలంగాణ సాహితీ వనంలో పూసిన ఎర్ర మందారం(Erra Mandaram), విప్లవ భావాల సూరీడు. సరళమైన పదాలు రక్తం ఉడికించే వాక్యాలతో మర ఫిరంగుల్లాంటి కవితలు(Poems) రాశారు. రాజకీయం(Politics) పట్ల విశ్వాసం లేదని తెలిపారు. పేదరికంతో క్షయ వ్యాధి బారినపడ్డా తన పంథాను మార్చుకోలేదు. నా సాహిత్యం సామాన్య ప్రజల కోసమే అని, డబ్బుల కోసం కాదని చెప్పిన నిస్వార్థ కవి సూరీడు.
- ఉమాశేషారావు వైద్య
