- గసగసాలు ఉపయోగించండి..
గసగసాలు శరీరానికి తక్షణ శక్తిని అందించి, నీరసాన్ని తరిమికొట్టడంలో ఇవి దోహదపడతాయి. గసగసాలు రుచి కోసం ఉపయోగించే దినుసులు మాత్రమే కావు.. అవి ఒక అద్భుతమైన ఔషధాల గనులు. వీటిలో క్యాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. నేటి ఆధునిక జీవన శైలిలో సరిగా నిద్రపట్టని వారికి, నీరసం, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి గసగసాలు సంజీవనిలా పనిచేస్తాయని రీసెర్చ్ గేట్ అధ్యయనం పేరొంది.
గసగసాల్లో మెగ్నీషియం పుషలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రకు కారణమయ్యే హార్మోన్ల స్థాయిని క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది. రాత్రి పడుకునే గంట ముందు వేడి పాలల్లో కొద్దిగా గసగసాల పొడి లేదా నానబెట్టిన గసగసాల పేస్ట్ కలుపుకొని తాగితే గాఢ నిద్ర పడుతుంది.
గసగసాల్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే ప్రొటీన్, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి రోజంతా ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడతాయి.
మన శరీరానికి అందాల్సిన క్యాల్షియం, ఫాస్పరస్‌లో సింహభాగం ఒక్క టేబుల్ స్పూన్ గసగసాల ద్వారా పొందొచ్చు. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆస్టియో పొరోసిస్ సమస్యలను నివారించడంలో గసగసాలు కీలక పాత్ర పోషిస్తాయి.
నోటిపూతను తగ్గించడంలోనూ గసగసాలు కీలకంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ పెయిన్ గుణాలు అల్సర్లను తగ్గించడంలో దోహదపడతాయి. గసగసాలను బాగా నానబెట్టి ఆ నీటిని తాగడం లేదా పేస్ట్‌లా చేసి పాలలో కలుపుకొని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి నోటి పూత త్వరగా తగ్గుతుంది
