ఆఫ్గనిస్థాన్.. ఇండియాలో దౌత్యవేత్త(Diplomat in India)గా నూర్ అహ్మద్ నూర్(Noor Ahmed Noor)ని నియమించింది. ఇరు దేశాల సంబంధాలు(Relations) పెరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. ఆఫ్గనిస్థాన్.. మందులు(Medicines), వీసాలు(Visa), మానవతా సహాయం(Humanitarian Support) కోసం ఇండియా వైపు చూస్తోంది. పాకిస్థాన్(Pakistan)తో ఆ దేశ సంబంధాలు క్షీణించిన పరిస్థితుల్లో భారత్‌కు దగ్గరవుతోంది. ఆఫ్గనిస్తాన్ ఔషధ అవసరాలకు ఇండియా కీలక ప్రత్యామ్నాయ భాగస్వామిగా ఎదుగుతోందని ఆ దేశ ప్రజారోగ్య మంత్రి మవ్లావి నూర్ జలాల్ జలాలీ డిసెంబర్‌లో అన్నారు. ఇండియా సహకారంలో సరికొత్త అధ్యాయం తెరవాలని ఆఫ్ఘనిస్తాన్ చూస్తోందని చెప్పారు. రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలను, నమ్మకమైన ఆరోగ్య భాగస్వామిగా ఇండియా పాత్రను ఆయన హైలైట్ చేశారు.
Afghanistan | ఇండియాలో దౌత్యవేత్త నియామకం
- Advertisement -
RELATED ARTICLES
