కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ బస్టాప్ వద్ద శుక్రవారం సాయంత్రం స్కూల్ బస్ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు, వివరాలలోకి వెళితే దుర్షేడ్ గ్రామం నుండి కరీంనగర్ వైపు మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న బొడ్డు శశి కుమార్ (28) తన షైన్ మోటార్ సైకిల్ పై కరీంనగర్ వైపు వచ్చుచుండగా వెనుక నుండి దుర్షేడ్ బస్టాప్ వద్ద ఆల్ ఫోర్స్ పాఠశాలకు చెందిన బస్సు స్కూలు టీచర్లను ఎక్కించుకొని వచ్చుచూ అతివేగముగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి తన ముందు వెళ్తున్న శశి కుమార్ ను డీ కొట్టగా రోడ్డు మీద పడిపోయిన శశి కుమార్ తలపై నుండి బస్ టైర్ వెళ్లగా శశి కుమార్ తలపగిలి మెదడు రోడ్డుపై చిల్లి అక్కడికక్కడే మరణించినాడు.
బస్సు డ్రైవర్ అక్కడి నుండి తన బస్సును వదిలి పారిపోయాడు ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రదేశానికి తన సిబ్బందితో మృతుని పరిస్థితిని ప్రమాదం జరిగిన ప్రదేశమును పరిశీలించి అప్పటికే చేరుకున్న మృతుని కుటుంబ సభ్యులు రోడ్డు మీద ఏడ్చుకుంటూ ఉండగా వారిని బస్ డ్రైవర్ పైన తప్పనిసరిగా కఠిన చర్య తీసుకుని మృతుడి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేస్తామని రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు.
శశి కుమార్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మృతుడు శశి కుమార్ కు భార్య చిన్న పాప కుమార్తె ఉన్నారని ఢీకొట్టిన ఆల్ఫోర్స్ స్కూల్ బస్సు ( TS 22 TA 0953 ) పోలీసులు ఆధీనంలోనికి తీసుకున్నారని డ్రైవర్ పంతంగి అనిల్ పరారీలో ఉన్నాడని నిందితుడిని వెంటనే పట్టుకుంటామని రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు.
