మగ సంతానం లేకపోతే ఏంటి నేను లేనా అంటూ ఓ కుమార్తె తన తండ్రికి తలకొరివి పెట్టిన సంఘటన జగదేవపూర్ మండలంలో శుక్రవారం రోజున జరిగింది. జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన కామల్ల రామయ్య అనారోగ్యం కారణంగా గురువారం నాడు ఆకాల మరణం చెందారు. రామయ్యకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారసులు లేకపోవడం వల్ల పెద్ద కూతురు తండ్రి తలకొరివి పట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది.
బాపు అంటూ కూతుర్ల రోదించిన తీరు చూపర్లను కంట తడి పెట్టించింది. మరణించిన రామయ్యా కుటుంబాన్ని సర్పంచుల పురం సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కొండపోచమ్మ మాజీ ఉపేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి నాచారం దేవాలయం మాజీ డైరెక్టర్ బుద్ధ నాగరాజు, స్థానిక సర్పంచ్ రజిత, ఉప సర్పంచ్ లు శ్రీనివాసరెడ్డి కూడా గణేష్, సిపిఐ నాయకుడు దయానంద్ రెడ్డి పలువురు నేతలు మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతి వ్యక్తం చేస్తూ ధైర్యంగా ఉండాలంటూ చెప్పారు.
