- పాలకవీడు ఆరోగ్య ఉప కేంద్రం సమస్యపై ఆరా తీసిన కలెక్టర్..
- పూర్తిస్థాయి వైద్యున్ని నియమించనున్నట్లు వెల్లడి..
- హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు..
ఆదాబ్ కథనానికి స్పందన లభించింది. ఈనెల 7న వెలువడిన ‘‘వైద్యుడు లేక అవస్థలు వైద్యం కోసం పరుగులు’’ అనే వార్తా కథనానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ గౌడ్ స్పందించారు. మంగళవారం పాలక వీడు ప్రాథ మిక ఆరోగ్య ఉపకేంద్రం సమస్యపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆరా తీసినట్లు ఆయన తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో త్వరలో పాలక వీడుకు పూర్తిస్థాయి వైద్యాధికారిని నియమించనున్నట్లు తెలి పారు. నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న ఆదాబ్ దినపత్రికకు మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -
