Wednesday, February 11, 2026
Homeకరీంనగర్Bandi Sanjay Kumar | కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై ‘బండి’ ఫైర్

Bandi Sanjay Kumar | కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై ‘బండి’ ఫైర్

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి(Union Minister of State for Home Affairs) బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) ఇవాళ కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల(BRS, Congress Parties)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Rangareddy Project) పేరుతో ఆ రెండు పార్టీలు ఇప్పటివరకు చేసినదంతా రాజకీయ నాటకమేనని(Political Drama) విమర్శించారు. నిజాలను దాచిపెట్టి, అబద్ధాలను అందంగా పలికి, తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్నాయనేది వాస్తవమని చెప్పారు. ‘విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం నీటి కేటాయింపులకు సంబంధించి 6 ప్రాజెక్టుల విషయంలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ అభ్యంతరాలు చెప్పకూడదని ఉంది. మరి ఈ జాబితాలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పేరు ఎక్కడుంది?. లేనిదానికి నిధులు ఎలా ఇస్తారు?. జాతీయ హోదా ఇవ్వడమే హాస్యాస్పదం’ అని బండి సంజయ్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News