అబ్దుల్లాపూర్ మెట్టు: హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో భారీ అవినీతి తిమింగలం ఎసిబికి చిక్కింది. తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులు ఫిర్యాదుదారుడి నుండి రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB Raid) వలకు చిక్కారు.
హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం భూమి సర్వే చేసి జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే రిపోర్టు ఇచ్చేందుకు తొలుత రూ.30 లక్షలు డిమాండ్ చేసి, చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 లక్షలు తీసుకుంటుండగా వలవేసి సర్వేయర్‌ను పట్టుకున్న ఏసీబీ అధికారులు.


లంచం సొమ్ము స్వాధీనం చేసుకుని, రసాయన పరీక్షలో సర్వేయర్ చేతివేళ్లకు పాజిటివ్ రావడంతో ఇద్దరు అధికారులను అరెస్టు చేసి, నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు లంచం తీసుకున్నట్లు ఏసీబీ(ACB Raid) పేర్కొంది. కేసు దర్యాప్తు కొనసాగుతుందని తెలియజేశారు.
తారామతి పెట్, గౌరెల్లి వంటి పలు గ్రామాలలో ఓ ఆర్ ఆర్ లో పోనీ భూమిని కూడా పోయిందని, తప్పుడు సర్వేలు చేసి, కోట్ల రూపాయల భూములను ఇతరులకు అప్పనంగా కట్టబెట్టి, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి, లక్షల రూపాయలు దండుకున్నారని అబ్దుల్లాపూర్‌మెట్ మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. లంచాలకు అలవాటు పడి సామాన్య ప్రజలను పీడిస్తున్న ఇలాంటి అవినీతి అధికారులను సస్పెండ్ చేయకుండా, సర్వీస్ నుంచి తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
