Friday, February 27, 2026
Homeక్రైమ్ వార్తలువిద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి

గత కొంత కాలంగా పాఠశాలలో చదువుకునే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…గత కొంత కాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా చంద్రగిరి నగర్ కాలనీ లో నిస్సీ స్వాతి పేరుతో ఓ పాఠశాల నడిపిస్తున్నారు విజయ్ కుమార్ అనే వ్యక్తి. పాఠశాలలో చదివే విద్యార్థినులతో ఇంట్లో పనులు చేపించడం,వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నిన్న పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని తల్లితండ్రులకు చెప్పింది బాలిక.ఈ ఘటన పట్ల కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాల పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ప్రధానోపాద్యాదైన విజయ్ కుమార్ ను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి అనుమతులు లేని పాఠశాలల పై చర్యలు తీసుకుంటామని ఎం ఈ వో జెమినీ కుమారి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News