మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ని తన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మల్లారెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మల్లారెడ్డి కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు తుడుం గణేష్, ఉమా నాగరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి కుమార్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
