అమెరికా(America)లోని నెబ్రాస్కా రాష్ట్ర తెలుగు సమితి(Telugu Samiti of Nebraska-TSN) మొట్టమొదటి యువజన సదస్సు(Conference) విజయవంతంగా జరిగింది. ఇండియన్ అమెరికన్ స్టూడెంట్స్(Indian American Students), పేరెంట్స్(Parents) పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థుల నుంచి కాలేజీ స్టూడెంట్స్ వరకు హాజరయ్యారు. ఒమాహా(Omaha)లోని మన దేశ సమాజం నుంచి భారీ స్పందన వచ్చింది. టీఎస్ఎన్ అధ్యక్షుడి(TSN President)గా కొల్లి ప్రసాద్(Kolli Prasad) వ్యవహరిస్తున్నారు. కార్యక్రమానికి హాజరైనవారి ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. మనం ఎక్కడి నుంచి వచ్చాం అనే మూలాలను మర్చిపోకుండా మసలుకుంటే మనం ఎప్పుడూ ఒంటరిగా ఫీలవ్వం అని కొల్లి ప్రసాద్ సూచించారు. ప్యానెల్ డిస్కషన్.. హైలైట్‌గా అనిపించింది. యూత్ కమిటీకి చైర్‌పర్సన్‌గా క్రాంతి సుధ, కోచైర్‌గా వివేక్ పోషాలు ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు.
Telugu Samiti of Nebraska | తొలి యువజన సదస్సు సక్సెస్
By Aadab Desk
- Advertisement -
Previous article
