Friday, April 3, 2026
Homeవరంగల్‌Police Advisory | ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి.

Police Advisory | ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి.

  • స్థానిక ఎస్సై బి.ప్రవీణ్.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తిని స్థానిక ఎస్సై బి ప్రవీణ్ తెలియజేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఏలాంటి డీజే లకు అనుమతి లేదు కావున ప్రజలు గమనించి, సహకరించగలరు. నిబంధనలకు విరుద్ధంగా డీజే లు నిర్వహించినట్లయితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదు, డిసెంబర్ 31 జనవరి 1 రోజుల్లో పర్వతగిరి ప్రాంతం అంతట డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ పోలీస్ బందోబస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా 31 డిసెంబర్ రాత్రి కూడా రోడ్లపై కేక్ కటింగ్ గాని బైకుల మీద ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయడం గాని చేయరాదని హెచ్చరించారు. ముఖ్యంగా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పాటించాలని సూచించారు. రోడ్ల పైన క్రాకర్స్ కాల్చడం వంటివి చేయరాదు.

డిసెంబర్ 31 అనేది ప్రతి సంవత్సరం వస్తుంది జీవితం కోల్పోతే మళ్లీ తిరిగి రాదు. కావున ప్రజలందరూ గమనించగలరని, ముఖ్యంగా యువత ఒక్కరోజు ఆనందం గురించి జీవితాన్నిపణంగా పెట్టకండని తెలిపారు. అదేవిధంగా చైనా మాంజా ఉపయోగించడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాటిని నిషేధించడం జరిగింది. కావున చైనా మాంజా వినియోగించకూడదు అలాగే ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే చట్టరిత్వం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News