Wednesday, February 11, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంFormer Sarpanches | పాత సర్పంచ్ల సమస్య తీరేది ఎప్పుడు!

Former Sarpanches | పాత సర్పంచ్ల సమస్య తీరేది ఎప్పుడు!

  • అప్పులు చేసి ఆగమైన అప్పటి సర్పంచ్‌ల గతి ఏంటి.?
  • నిధులు లేక కొట్టుమిట్టాడుతున్న నూతన సర్పంచులు!
  • నేటి శాసనసభ సమావేశంలో మాజీ సర్పంచుల సమస్య తీరేనా?

కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుండి గ్రామపంచాయతీ లకి నిధులు ఇవ్వకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి కొంచెం కూడా ముందుకు సాగలేదు. 2019లో కొలువుదీరిన అప్పటి మాజీ సర్పంచులు అప్పులు చేసి ఉన్న భూములని అమ్ముకొని గ్రామాలలో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గ్రామాలలో సిసి రోడ్లు, క్రీడా ప్రాంగణాలు, తాగు నీరు, బోరు మోటర్లు, పైప్‌ లైన్లు లీకేజీ,పారిశుద్ధ్య పనులు సొంత డబ్బుతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు . ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామపంచాయతీ కి నిధులతో ట్రాక్టర్‌ మెయింటెనెన్స్‌, గ్రామంలో ఉన్న వీధి దీపాలు, గ్రామ పారిశుద్ధ కార్మికుల జీతాలకే సరిపోయింది.

2024 మాజీ సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటికీ ఒక్కొక్క గ్రామపంచాయతీకి సుమారు 5 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకు రావాల్సి ఉందని ఆయా గ్రామపంచాయతీ సర్పంచులు చెబుతున్నారు.2024 సంవత్సరం తర్వాత సర్పంచ్‌ లకు పదవి కాలం ముగిసిన మరుసటి రోజు ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శులు బాధ్యతలు తీసుకొని వాళ్ళు కూడా అప్పులు చేసి తిప్పలు పడి గ్రామములో వీధి దీపాలు చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ చెత్త ట్రాక్టర్‌ మెయింటెనెన్స్‌ చేస్తూ స్పెషల్‌ ఆఫీసర్‌ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీని సుమారు రెండు సంవత్సరాలు తిప్పలు పడుతూ నెట్టుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లకు సుమారు 550 కోట్ల నుండి 700 కోట్ల వరకు మాజీ సర్పంచులకు బకాయి బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

నేడు అసెంబ్లీ సమావేశాల సమయంలో
ముట్టడికి సిద్ధమైన తెలంగాణ సర్పంచ్‌ జేఏసీ

రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పాలనలో ఒక్క రూపాయి గ్రామ పంచా యతీకి నిధులు ఇవ్వకుండా పాత బకాయాలు చెల్లించకుండా సర్పంచులు ఇబ్బంది పడుతున్న పట్టించుకోని ఈ ప్రభుత్వంపై తిరగబడే దిశగా డిసెంబర్‌ 29 సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చారు. తెలం గాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఉమెన్‌ రైట్స్‌ కమిషనర్‌ (నRజ)ని కూడా ఆశ్రమించి సర్పంచులకు చెల్లించాల్సిన పెండిరగ్‌ బిల్లులపై విచా రణ చేపట్టాలని హెచ్‌ఆర్సీని తెలంగాణ సర్పంచ్ల సంఘం కోరినట్టు తెలిసింది.

కొత్త సర్పంచులకు పాత సర్పంచ్ల సమస్య!

2025 డిసెంబర్‌ గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడుదల వారీగా జరగగా 11, 14, 17,తేదీలలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం యధావిధిగా కొనసాగించింది. పాత బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహించొద్దని సర్పంచులు సంఘం కోరినప్పటికీ ఎన్నికల ప్రక్రియ యధావిధిగా కొనసాగింది. డిసెంబర్‌ 22 నూతన సర్పంచులు ప్రమాణ స్వీకారాలు చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కొత్త సర్పంచ్లకు పాత సర్పంచుల సమస్య గ్రామపంచాయతీకి వచ్చే నిధుల కొరతను చూసి తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News