వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2026-27) సంబంధించిన బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెడతారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి (Interest) రేకెత్తిస్తోంది. 2026 ఫిబ్రవరి ఒకటో తారీఖు ఆదివారం కావటమే ఇందుకు కారణం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (Union Minister Of Finance) గత 9 ఏళ్లుగా.. అంటే.. 2017 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీనే బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు. 2017కు ముందు ఫిబ్రవరి చివరి తేదీన ప్రవేశ పెట్టేవారు. అయితే.. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తారీఖు ఆదివారం రావటంతో ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెడతారా లేక తెల్లారి సోమవారం ప్రవేశపెడతారా అనే గందరగోళం నెలకొంది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో.. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించే పక్షంలో.. నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) ఫిబ్రవరి ఒకటో తేదీనే ఆదివారమే (Sunday) బడ్జెట్‌ను ప్రవేశపెడతారని అధికారిక వర్గాలు(Official Sources) వెల్లడించాయి.
Union Budget | కేంద్ర బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెడతారు?
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
