Sunday, February 22, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | గెలుపు వరకే జనం తోడు…!

Aaj Ki Baath | గెలుపు వరకే జనం తోడు…!

జెండా మోసినవ్‌…! వాళ్లు పలకరిస్తే మురిసినవ్‌…!పది రోజులు పసందైన విందులను చూసినవ్‌…!వాళ్ల పదవుల కోసం పల్లెల్లో మంటలు పుట్టించే మాటలు చూసినవ్‌…! మీ నాయకుడు గెలవడానికి ఎంత కష్టం చేసినవో…! నీ కష్టం విలువ కేవలం కోటర్‌ సీసా బిర్యానీ ప్యాకేట్‌తో రుణం తీర్చేసాము అనుకునే నాయకులు వాళ్లంతా…! నువ్వు ఎవరి కోసం కష్టపడినవో వాళ్లు బాగానే ఉంటారు…! గెలుపు వరకే జనం తోడు…! అవసరం ఉన్నంతవరకే ఆప్యాయత చూపిస్తారు..! ఓ సామాన్యుడా జగమెరిగిన పోరులో ఎప్పటికీ ఒంటరివి నువ్వే జంగ్‌ సైరన్‌ ఊదినప్పటి నుండి నీ తాపత్రయం నువ్వెత్తుకున్న జెండా గెలవాలని కానీ రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మనవి గుర్తుపెట్టుకో నీ కష్టం నువ్వే చేయాలి నీ బ్రతుకు నువ్వే బతకాలి ఏ నాయకుడు వచ్చి నిన్ను నీ జీవితాన్ని ఉద్ధరించడు.వాళ్ళ స్వార్థపూరిత రాజకీయ పదవుల కోసం నాలుగు రోజుల నటన చేస్తారు అంతే, వ్యవస్థ మెరుగుపడాలి అంటే సామాన్య వ్యక్తి ఆర్థికంగా ఎదగడంతో పాటు సమాజంపై అవగాహనతో మెలగాలి ఇకనైనా అన్ని పక్కన పెట్టి నీ జీవితంలో నువ్వే హీరోగా ఉండాలి…! అని కోరుకుంటూ…!

  • కాత మధూకర్‌
- Advertisement -
RELATED ARTICLES

Latest News