Thursday, February 12, 2026
Homeవరంగల్‌Suspension | కాంగ్రెస్ నుండి పలువురి సస్పెన్షన్..

Suspension | కాంగ్రెస్ నుండి పలువురి సస్పెన్షన్..

చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులను గ్రామ కాంగ్రెస్ నాయకుల నిర్ణయం మేరకు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు ఏడుగురిని మరియు ఎలాయిగూడెం లొ ఐదుగురిని సస్పెన్షన్ చేసినట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్దన రమేష్ బుధవారం తెలిపారు. చెన్నారావుపేట గ్రామంలో జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున 12 మంది సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు.కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కంది నారాయణ రెడ్డి,నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నన్నెబోయిన రమేష్ యాదవ్,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు సాధు మధు సుధన్ రెడ్డి,కోపాకుల నీటి సంఘం చైర్మన్ ఎనగందుల జయేందర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ మహిళా కార్యదర్శి ధోని కమలమ్మ,కాంగ్రెస్ మండల కార్యదర్శి చెవ్వ వెంకటేశ్వర్లు,మండల నాయకులు చిట్టె రవి కుమార్,ఎల్లయ్యగూడెం లో చిప్ప ఈశ్వర్,బత్తిన వీరన్న,మంచాల శ్రీనివాస్, మంచాల సదయ్య,సౌరపు సాంబరాజు లను అధ్యక్షుడు భాషబోయిన రమేష్ సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు.కాంగ్రెస్ పార్టీకి వీరికి ఇప్పటినుండి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News