Tuesday, June 16, 2026
HomeఫోటోలుSamantha | ‘మా ఇంటి బంగారం’ మూవీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది

Samantha | ‘మా ఇంటి బంగారం’ మూవీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది

ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమా టీం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత‌లు డి.సురేష్ బాబు, స్వప్నా దత్, జాన్వీ నారంగ్, డైరెక్ట‌ర్ దేవా కట్టా తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘‘మా ఇంటి బంగారం’తో సమంతకి మంచి విజయం దక్కాలి. ‘ఓ.. బేబీ’తో సమంత, నందినీ కలిసి నాకు మంచి సక్సెస్ ఇచ్చారు. ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. రాజ్, హిమాంక్ చాలా కష్టపడ్డారు. జూన్ 19న ఈ సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

- Advertisement -

సమంత మాట్లాడుతూ .. ‘నేను ఇకపై ఏడాదికి రెండు సినిమాలు అభిమానులకు అందించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అయితే ఓ మంచి చిత్రాన్ని చేశాం. ఇప్పటి వరకు నేను నటిగా ఎంతో ఎంజాయ్ చేశారు. నిర్మాతకు ఉండే కష్టాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. గత వారం రోజులుగా మా టీం నిద్రపోవడం లేదు. ప్రతీ ఒక్క డిపార్ట్మెంట్ ప్రాణం పెట్టి పని చేసింది.

రాజ్ అండ్ డీకే, నందినీ రెడ్డి నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. రాజ్ అండ్ డీకే ఎప్పుడూ కష్టపడుతూ పని చేస్తూనే ఉంటారు. మా కోసం వచ్చిన ప్రతీ ఒక్క అతిథికి ధన్యవాదాలు. నా మీద ఇప్పటికీ అదే ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. జూన్ 19న రాబోతోన్న ‘మా ఇంటి బంగారం’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

నిర్మాత రాజ్ నిడిమోరు మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన సురేష్ గారు, స్వప్నా, జాన్వీలకు థాంక్స్. ప్రేమ, పిచ్చి అనేది తెలుగు పరిశ్రమలోనే ఎక్కువగా ఉంటుంది. ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి వసంత్, ధర్మేంద్ర పిల్లర్స్‌లా నిల్చున్నారు. ఈ జర్నీలో ఎంతో మంది గొప్ప టెక్నీషియన్లను, ఆర్టిస్టులను కలుసుకున్నాం. నందినీ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మేం రాయడం ఒకెత్తు అయితే.. సమంత నటించడం ఇంకో ఎత్తు. సమంత ఓ అద్భుతమైన నటి. మేం హిందీలో ఎన్నో సినిమాలు చేశాం. కానీ దీనికి వస్తున్న రెస్పాన్స్, ఎగ్జైట్మెంట్ నాకు ఎక్కడా కనిపించలేదు. అందరూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘మా ఇంటి బంగారం’ కోసం గత కొన్ని రోజులుగా ఎంతో మంది నిద్ర లేకుండా పని చేస్తున్నాం. అద్భుతమైన టీం నిరంతరం శ్రమించడం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ ఇండస్ట్రీలో నేను ఎంతో మంది స్నేహితుల్ని సంపాదించుకున్నాను. అదే నా బలం. రాజ్‌తో పని చేయడం ఎంతో సులభంగా అనిపించింది.

టీంగా మేం పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాం. నేను ఇచ్చిన మాట ప్రకారం సినిమాని ది బెస్ట్‌గా తీశానని అనుకుంటున్నాను. హిమాంక్ ఈ మూవీని భుజానికి ఎత్తుకున్నారు. నా మీద సమంత పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. జూన్ 19న మా చిత్రం రాబోతోంది. ఇంత వరకు చూసిన సమంత కంటే.. పది రెట్ల సమంతను చూస్తారు’ అని అన్నారు.

నిర్మాత జాన్వీ నారంగ్ మాట్లాడుతూ .. ‘‘మా ఇంటి బంగారం’ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. నందినీ గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సమంత కోసమే ఈ సినిమా వచ్చినట్టుగా ఉంది. టీం అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.

నిర్మాత స్వప్నా దత్ మాట్లాడుతూ .. ‘‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ బాగుంది. నందినీ రెడ్డి నాకు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. రాజ్‌కి నేను ఫస్ట్ ఫ్రెండ్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కానుంది. మేం మళ్లీ ఈ చిత్రంతోనే డిస్ట్రిబ్యూషన్‌లోకి వస్తున్నాం’ అని అన్నారు.

మైత్రి వై.రవి శంక‌ర్‌ మాట్లాడుతూ .. ‘‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్‌లోనే ఓ వైబ్రేషన్ ఉంది. సమంత గారు మాకు కూడా ఓ బంగారం లాంటివారే. మా బ్యానర్‌లో సమంత చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా సమంత గారు మా ఇంటి బంగారం అయ్యారు. శారీలో ఆ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. టీజర్, ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. పెద్ద ఓపెనింగ్స్ వస్తాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హిమాంక్ మాట్లాడుతూ .. ‘రాజ్ గారు ఈ లైన్ చెప్పినప్పుడు, టైటిల్ చెప్పినప్పుడు రిజల్ట్ ముందుగానే ఊహించాను. రాజ్, సమంత, నేను ముందుగా కూర్చుని రెడీ చేశాం. ఆ తరువాత వసంత్, నందినీ ఇలా అందరూ జాయిన్ అయ్యారు. జూన్ 19న మా సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

డైరెక్టర్ డీకే మాట్లాడుతూ .. ‘సమంతతో ఇది వరకు రెండు సిరీస్‌లకు పని చేశాం. ప్రతీ సారి ఆమె ప్రాణం పెట్టి నటిస్తారు. ఇందులోనూ వంద శాతం ఇచ్చారు. ట్రైలర్ చూశాక నేను ఎగ్జైట్ అయ్యాను. అందరితో కలిసి సినిమా చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. నేను లేకుండా రాజ్ మొదటి సారి ఈ ప్రాజెక్ట్ చేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డైరెక్ట‌ర్ దేవాకట్టా మాట్లాడుతూ .. ‘రాజ్, డీకే, నేను కలిసి షార్ట్ ఫిల్మ్స్ తీసే టైం నుంచీ స్నేహితులం. సమంత నిజంగానే బంగారం. గ్లింప్స్, టీజర్ వచ్చినప్పటి నుంచే బంగారం రాబోతోన్నట్టుగా అర్థమైంది. నందినీ రెడ్డి గారి మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ‘మా ఇంటి బంగారం’ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది’ అని అన్నారు.

తారాగణం:
సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: ట్రలాలా మూవింగ్ పిక్చర్స్
నిర్మాతలు: సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు
కథ, స్క్రీన్ ప్లే: రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్
ద‌ర్శ‌క‌త్వం: నందిని రెడ్డి
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
సంగీతం: సంతోష్ నారాయణన్
యాక్షన్: లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
ప్రొడక్షన్ డిజైన్: ఉల్లాస్ హైదూర్
పి.ఆర్.ఒ: వంశీ కాకా

- Advertisement -
RELATED ARTICLES

Latest News