బండరావిరాల గ్రామ సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన మన స్వేరో సర్కిల్ ఫౌండర్, స్వేరోస్ మాజీ వైస్ చైర్మన్ కందికంటి విజయ్ కుమార్ స్వేరో ని ఈరోజు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు స్వేరోస్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ IPS(VRS) తన నివాసానికి ఆహ్వానించి ఆత్మీయంగా సన్మానించారు.

ఈ సందర్భంగా విజయ్ కుమార్ కి RSP దిశానిర్దేశం చేస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, బండరావిరాలను దేశంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అని ఆదేశించారు.
అలాగే విజయ్ కుమార్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి, నిరంతరం శ్రమించిన బండరావిరాల స్వేరోస్ అందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించి సన్మానం చేశారు.
- Advertisement -
