Tuesday, February 10, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఇది పదవి కాదు, సేవకు అవకాశం

Aaj Ki Baath | ఇది పదవి కాదు, సేవకు అవకాశం

శుభాకాంక్షలు..
ఊరూరా గ్రామపంచాయతీ నూతనంగా ఎన్నుకున్న సర్పంచ్‌,పాలకవర్గాల ప్రమాణస్వీకారోత్సవ జరిగింది.ఈ రోజు మీ చేతుల్లోకి ఊరి భవిష్యత్తు,బాధ్యత వచ్చింది.ఇది పదవి కాదు,సేవకు అవకాశం.సవాళ్లు ఉంటాయి,పరిస్థితులు పరీక్షిస్తాయి,కానీ సంకల్పం ఉంటే అభివృద్ధికి దారులు అవే తెరుచుకుంటాయి.ప్రజల నమ్మకమే మీ బలం,ఊరి సహకారమే మీ ఆయుధం.నూతన సర్పంచులలో కనిపిస్తున్నఉత్సాహం,పట్టుదల, నాయకత్వ లక్షణాలు పల్లెలను ముందుకు నడిపిస్తాయి.అందరినీ కలుపుకొని ఊరిని ఒక కుటుంబంలా భావిస్తూ,న్యాయం-నిజాయితీ- నిబద్ధతలతో పాలన సాగించండి. ఊరి ప్రథమ పౌరుడిగా మీ పాలన పట్టుదలతో అభివృద్ధి సాధిస్తే మీ పేరు చరిత్రలో నిలుస్తుంది.ప్రజాసేవే మీ ప్రయాణం కావాలి. ’’ఆదాబ్‌ హైదరాబాద్‌’’ పత్రిక ప్రజా గొంతుకై అండగా ఉంటుంది.. ఆల్‌ ది బెస్ట్‌

  • మేదాజీ
- Advertisement -
RELATED ARTICLES

Latest News