Wednesday, March 4, 2026
HomeతెలంగాణKCR Vs Revanth | కేసీఆర్‌కి సీఎం రేవంత్ సవాల్

KCR Vs Revanth | కేసీఆర్‌కి సీఎం రేవంత్ సవాల్

నీళ్లు, నిజాలపై అసెంబ్లీ వేదికగా..
ఫేస్ టూ ఫేస్ చర్చకు రావాలి
కేసీఆర్ గౌరవానికి భంగం కలగనివ్వం
నీటి వాటాల్లో అన్యాయానికి కేసీఆరే బాధ్యుడు
కేసీఆర్, కేటీఆర్‌లు ఆర్థిక ఉగ్రవాదులు
సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత(BRS Party President) కేసీఆర్(KCR) ఇప్పటికైనా ప్రజల ముందుకు రావడం సంతోషకరమని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. కేసీఆర్ మీడియా సమావేశంలో చేసిన విమర్శలకు సీఎం తీవ్రంగా స్పందించారు. ఉమ్మడి రాష్ట్ర పాలన కన్నా కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలోనే తెలంగాణ(Telangana)కు నీటి వాటాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ నిజాలు మాట్లాడకుండా అబద్ధాలనే పెట్టుబడిగా రాజకీయాలు (Politics) చేస్తున్నారని విమర్శించారు. ఆయన పాలనలోనే ఎక్కువ స్థాయిలో జలదోపిడీ జరిగిందని విమర్శించారు. 811 టీఎంసీల నికర జలాల్లో 299 టీఎంసీలే సరిపోతాయని సంతకం చేసింది కేసీఆరేనని గుర్తు చేశారు. నీటి వాటాలపై సంతకాలు చేసి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నష్టం చేకూర్చారని ఆరోపించారు.

- Advertisement -

కృష్ణా జలాల్లో 71 శాతం వాటా కావాలని ప్రస్తుత ప్రభుత్వం పోరాటం చేస్తోందని, కానీ.. పదేళ్ల పాలనలో కేసీఆర్ కనీసం సగం వాటా కూడా అడగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి దోహదం చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని విమర్శించారు. పదేళ్ల పాలనలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని అన్నారు.

కృష్ణా, గోదావరి జలాల వాటాలపై జనవరి 2 నుంచి శాసన సభలో చర్చ చేపడతామని సీఎం వెల్లడించారు. ఈ చర్చకు కేసీఆర్, కేటీఆర్ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, కేటీఆర్‌‌లు ఆర్థిక ఉగ్రవాదులు అని రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బయటకు రావడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. కేసీఆర్ గత పాలనతోపాటు భవిష్యత్తు ప్రణాళికలపై అసెంబ్లీలో చర్చకు రావాలని రేవంత్‌రెడ్డి కోరారు. కేసీఆర్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని తమ ప్రభుత్వం సరిదిద్దుకుంటూ ముందుకెళ్తోందన్నారు.

చర్చకు రావాలంటే కేసీఆర్ ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్, హరీశ్‌రావు కలిసి కేసీఆర్‌ను రాజకీయంగా నిర్బంధించారని సీఎం ఆరోపించారు. పార్టీపై ఆధిపత్యం కోసం వారిద్దరూ పోటీపడుతున్నారని అన్నారు. పార్టీని టేకోవర్ చేస్తే హరీశ్‌రావుకు వేల కోట్ల లాభం వస్తుందన్న వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలగనివ్వనని సీఎం హామీ ఇచ్చారు. సభలో ఎవరైనా అవమానిస్తే చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సూచిస్తానన్నారు. బహిరంగ సభల కన్నా అసెంబ్లీలోనే సమగ్రంగా చర్చ జరగాలని సూచించారు. ప్రాజెక్టుల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు, సాంకేతిక నిపుణుల కమిటీ సలహాల మేరకే ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News