ఏపీ మాజీ సీఎం(Ap Formenr CM), వైఎస్సార్సీపీ అధినేత (YSRCP President) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohanreddy)కి సీఎం చంద్రబాబు (CM Chandrababu) పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes) తెలిపారు. సుదీర్ఘ కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుణ్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా తమ ప్రియతమ నేత వైఎస్ జగన్ జన్మదినాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. కేక్ కట్ చేసి పరస్పరం పంచుకున్నారు. ఆసుపత్రుల్లో పేద రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాలు కూడా చేపట్టారు. వైఎస్ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
- Advertisement -
