Thursday, March 26, 2026
HomeతెలంగాణMinister Ponnam | జనవరిలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం

Minister Ponnam | జనవరిలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం

కంపెనీలు, డీలర్లు, ఏజెన్సీలు ఈ కార్యక్రమం నిర్వహించాలి
విద్యుత్ వాహన తయారీ సంస్థల ప్రతినిధులు, డీలర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం

వచ్చే జనవరి నెలలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం(Road Safety Programme) నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Transport Minister Ponnam Prabhakar) చెప్పారు. వాహనాల తయారీ సంస్థలు, డీలర్లు, ఏజెన్సీలు పాల్గొనాలని కోరారు. విద్యుత్ వాహన తయారీ సంస్థల ప్రతినిధులు, డీలర్లతో హైదరాబాద్‌లోని హోటల్ దస్‌పల్లాలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని తెలిపారు. ఢిల్లీ(Delhi) లాంటి పరిస్థితి హైదరాబాద్‌(Hyderabad)కు రావద్దనే ఉద్దేశంతో జీవో నంబర్ 41 కింద ఈవీ పాలసీ(EV Policy) తెచ్చామని పేర్కొన్నారు.

- Advertisement -

మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా ఏమన్నారంటే..

  • ఇప్పటివరకు 1,59,304 వాహనాలకు రూ.806.35 కోట్లను ఈవీ వాహనాలపై రాయితీ కింద ఇచ్చాం.
  • ప్రభుత్వం.. రూ.806 కోట్ల టాక్స్ నష్టపోయినా.. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడానికి తోడ్పడింది..
  • విజన్ 2047 ప్రకారం ఉద్గారాలను జీరోకి తగ్గించడానికి మేం చేపడుతున్న చర్యలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి.
  • హైదరాబాద్ ఓఆర్ఆర్ వెలుపల పెరుగుతున్న కొత్త కాలనీల దృష్యా జీవో 263 తీసుకొచ్చాం.
  • ఇందులో భాగంగా 20 వేల ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటోలు, 10 వేల cng ఆటోలు,10 వేల LPG ఆటోలు, 25 వేల రెట్రో ఫీటెడ్ ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇచ్చాం.
  • నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి సరిపడా ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది.
  • ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీని కంపెనీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
  • జనవరిలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం జరుగుతుంది.
  • దానిపై మీరు విస్తృత అవగాహన కల్పించాలి.
  • కంపెనీలు, డీలర్లు, ఏజెన్సీలు జనవరిలో జరిగే రోడ్ సేఫ్ మంత్ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
  • స్కూల్ చిల్డ్రన్‌కి అవేర్‌నెస్ కలిస్తున్నాం.
  • రోడ్ సేఫ్టీ గురించి రేపు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం.
  • రోడ్ సేఫ్టీ‌ కోసం మీ వంతుగా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు, డీలర్లు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి.
  • షో రూమ్‌ల వద్ద, పెట్రోల్ బంకుల వద్ద, ఇతర ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచాలి.
  • నగరంలో 2800 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి.
  • ఇప్పటికే 700 బస్సులు నడుస్తున్నాయి..
  • మొన్న కొత్తగా 326 కొత్త రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుపుతోంది.
  • స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం.
  • ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ప్రాసెస్ నడుస్తోంది.
  • రవాణా శాఖ చెక్ పోస్టులు ఎత్తివేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చాం.
  • ప్రమాదాలను తగ్గించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేశాం.
  • పర్యావరణాన్ని కాపాడటానికి ఈవీ వెహికల్స్ వాడుతున్నారు.
  • ఏజెన్సీలు, ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మవారు.. కొనే వారికి ఒక మొక్కను ఇవ్వాలి.
  • ఆ మొక్కను నేడు నాటితే రేపటికి చెట్టుగా ఎదిగితే కాలుష్యం తగ్గుతుంది.
  • ప్రభుత్వ సంస్థల్లో 20 శాతం ఈవీ వాహనాలు వచ్చేలా చర్యలు చేపడతాం.
  • ఈవీ కంపెనీలు ప్రభుత్వానికి సహకరించాలి.
  • పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమంలో మీరంతా పాల్గొనాలి.
  • ప్రజలు ఈవీలు ఉపయోగించేలా కంపెనీలు విస్తృతంగా ప్రచారం కల్పించాలి.

స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్‌రాజ్ మాట్లాడుతూ..

  • ఈవీ పాలసీ కింద.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారికి ప్రభుత్వం 100 శాతం ట్యాక్స్ మినహాయింపు ఇస్తుంది.
  • ఈవీ పాలసీకి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
  • ఓఆర్ఆర్ పరిధిలో ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఇచ్చాం.
  • ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగినప్పుడే కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
  • పాత పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రో ఫీటెడ్‌ చేసి ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు అనుమతి ఇచ్చాం.
  • ఈవీలకు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయటం జరుగుతుంది.
  • మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం.
  • నగరంలో ఓఆర్ఆర్ లోపల పీఎం ఇ-డ్రైవ్ కింద 2800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతాం.
  • ఈ సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీ రమేష్, విద్యుత్ వాహన సంస్థల ప్రతినిధులు గోపాలకృష్ణ, సురేష్ రెడ్డి, గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES

Latest News