Friday, February 13, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంScam | జిహెచ్ఎంసిలో ‘ఆక్యుపెన్సీ' స్కామ్

Scam | జిహెచ్ఎంసిలో ‘ఆక్యుపెన్సీ’ స్కామ్

  • కమర్షియల్ బిల్డింగ్కు రెసిడెన్షియల్ ఓసి!
  • ‘టైపింగ్ ఎర్రర్’ అంటూ అధికారుల బుకాయింపు!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అక్రమాలకు అడ్డాగా మారుతోందా? నిబంధనలను తుంగలో తొక్కి, ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల గండి కొడుతూ అధికారులు సాగిస్తున్న ‘ఓసి’ దందా ఇప్పుడు నగరంలో సంచలనంగా మారింది. గచ్చిబౌలిలోని ఒక భారీ వాణిజ్య భవనానికి నివాస భవనంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ (ఓసి) జారీ చేయడం వెనుక భారీ స్థాయిలో ముడుపులు అందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అసలేం జరిగింది? నిబంధనల ఉల్లంఘన ఇలా..

గచ్చిబౌలి గ్రామంలోని ప్లాట్‌నంబర్‌ 206, 206/ఏలో బి. అశోక్‌ బాబు అనే వ్యక్తికి సంబంధించిన భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో అధికారులునిబంధనలనుఇష్టారాజ్యంగా మార్చేశారు.

- Advertisement -

తొలి అనుమతి: జూన్‌ 1, 2023న ఈ ప్లాట్‌లో వాణిజ్య భవనం నిర్మించుకోవడానికి అనుమతి లభించింది (పర్మిట్‌ నం: 5804/Gనవీజూూూ/2023-దీూ).

సవరించిన అనుమతి: మార్చి 21, 2025న ఇచ్చిన రివైజ్డ్‌ పర్మిషన్‌లో కూడా దీనిని 1 సెల్లార్‌ ం గ్రౌండ్‌ ం 2 అంతస్తుల వాణిజ్య భవనంగానే ధృవీకరించారు.

అసలు తిరకాసు: తీరా నిర్మాణం పూర్తయ్యాక, అక్టోబర్‌ 10, 2025న జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ (నం: 006988/ Gనవీజ/03316/ూఔూజ/ూూూ1/2025)లో మాత్రం అధికారులు మ్యాజిక్‌ చేశారు. అనుమతుల్లో వాణిజ్య భవనంగా ఉన్నది కాస్తా, ఓసి ఇచ్చేసరికి రాత్రికి రాత్రే ‘నివాస గృహం’ గా మారిపోయింది.

‘టైపింగ్‌ ఎర్రర్‌’ అట..
అధికారుల వితండవాదం!

అనుమతి ఇచ్చేటప్పుడు, సవరణలు చేసేట ప్పుడు లేని పొరపాటు.. కేవలం ఓసి ఇచ్చే సమ యంలోనే ఎలా వస్తుందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వివరణ కోరగా, అది కేవలం ‘‘టైపింగ్‌ ఎర్రర్‌’’ అని అధి కారులు చెప్పడం గమనార్హం. అయితే, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇది పొరపాటు కాదు, ఉద్దేశపూర్వకంగా చేసిన ‘చీకటి ఒప్పం దం’ అని స్పష్టమవుతోంది. హెడ్‌ ఆఫీస్‌ లోని శేర్లింగంపల్లి జోన్‌ సిటీ ప్లానర్‌ వెంకన్న, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ భార్గవిలు భారీగా ముడుపులు తీసుకుని బిల్డర్‌కు లబ్ధి చేకూర్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జిహెచ్‌ఎంసి ఖజానాకు భారీ నష్టం..

ఈ వ్యవహారంలో కేవలం రూ. 23 లక్షల కంపౌండిరగ్‌ ఫీజుతో అధికారులు సరిపెట్టేశారు. వాస్తవానికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డివియేషన్ల ప్రకారం భారీ జరిమానా విధించాల్సి ఉండగా, తక్కువ మొత్తంతో మమ అనిపించేశారు. ఆస్తిపన్ను వేటు: ఆక్యు పెన్సీ సర్టిఫికేట్‌ ఆధారంగానే ఆస్తి పన్ను లెక్కి స్తారు. వాణిజ్య భవనానికి ఉండాల్సి న పన్ను రేటు కంటే నివాస భవనానికి పన్ను చాలా తక్కువ. దీర్ఘకాలిక నష్టం: ఓసిలో ‘రెసిడెన్షియల్‌’ అని ఉండటం వల్ల భవిష్యత్తులో జిహెచ్‌ఎంసికి రావాల్సిన లక్షలాది రూపాయల వాణిజ్య పన్ను ఆదాయానికి శాశ్వతంగా గండి పడిరది.

ఉన్నతాధికారుల మౌనం.. లోపాయకారీ ఒప్పందమా?

టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఇంతటి భారీ కుంభకోణం జరుగు తుంటే కమిషనర్‌, సిసిపి, అడిషనల్‌ సిసిపి వంటి ఉన్నతాధి కారులు కళ్ళు మూసుకున్నారా లేక వారికి కూడా ఇందులో వాటా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. నిబంధనలను యథేచ్ఛగా అతిక్రమించిన అధికారులపై ఏసీబీ విచారణ జరిపి, ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని పౌర సమాజం డిమాండ్‌ చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News