- ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర ముదిరాజ్
ఏఐసీసీ ఆదేశాలు, టీపీసీసీ అధ్యక్షుల పిలుపు మేరకు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న కక్ష్యపూరిత చర్యలను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర ముదిరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కేంద్రం ఉద్దేశపూర్వకంగా వేధించడం రాజకీయ ప్రతీకారమేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా లబహీన పరచాలనే దురుద్దేశంతోనే ఈ కేసు సృష్టించచారని ఆరోపించారు. ఇది వ్యక్తులపై దాడి కాదని, దేశ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు న్యాయం జరిగే వరకు, నేషనల్ హెరాల్డ్ కేసును ఉపసంహరించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో శంకర్ షాద్‌నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అనిత రెడ్డి, పారిజాత, రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ నరేందర్, శంషాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజయ్ యాదవ్, శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు నర్కూడ గ్రామ సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నిరసనకు హాజరై సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ఛైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర ముదిరాజ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
