- 14 వార్డులకు 9 వార్డు మెంబర్ లు గెలుపు..
- 2186 భారీ మెజారిటీతో సర్పంచ్ అభ్యర్థి కర్రోళ్ల స్వప్న భారీ విజయం.
వనపర్తి జిల్లా గోపాల్ పేట కేంద్రంలో సర్పంచ్ పీఠం బిఆర్ఎస్ కైవాసం చేసుకుంది. గురువారం జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కర్రోళ్ల భాస్కర్ స్వప్న తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై 2186 భారీ మెజారిటీతో విజయం సాధించారు. బిఆర్ఎస్ భారీ విజయంతో గోపాల్ పేట ప్రజలు, కార్యకర్తలు సంబరాలలో మునిగితేలారు. అధికారం కోసం కాకుండా ప్రజల సేవయే పరమావాదిగ భావించి ప్రజలకు సేవ చేసిన కర్రోళ్ల స్వప్న భాస్కర్ కు ఈ విజయం దక్కడం వారి కృషికి నిదర్శనమని పలువురు గ్రామ ప్రజలు, మేధావులు చర్చించుకుంటున్నారు.


- Advertisement -
