Thursday, February 12, 2026
Homeక్రైమ్ వార్తలుGurugram | 42 వేల అక్రమ మద్యం సీసాల స్వాధీనం

Gurugram | 42 వేల అక్రమ మద్యం సీసాల స్వాధీనం

గురుగ్రామ్‌లోని ఓ విక్రేత నుంచి రూ.10 కోట్ల విలువైన 42 వేల అక్రమ విదేశీ మద్యం బాటిళ్ల(Illegal Foreign Liquor Bottles)ను హర్యానా పోలీసులు (Haryana Police) స్వాధీనం చేసుకున్నారు. ఈ స్టాక్‌ను కస్టమ్స్/ఎక్సైజ్ సుంకం చెల్లించకుండా (Without Tax Payment) దేశంలోకి రవాణా చేసినట్లు గుర్తించారు. ఇందులో ప్రీమియం అంతర్జాతీయ బ్రాండ్ల (Premium International Brands) బాటిళ్లు ఉన్నాయి. ఒక్కో బాటిల్‌‌ను రూ.5 వేల నుంచి రూ.లక్షన్నర వరకు అమ్ముతారు.

సరుకును వ్యవస్థీకృత స్మగ్లింగ్ మార్గాలను ఉపయోగించి విమానాశ్రయాల ద్వారా తెప్పిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మద్యాన్ని మిలీనియం సిటీ(Millennium City)లోని ప్రీమియం కస్టమర్లకు అధిక మార్జిన్‌లకు విక్రయిస్తున్నారని తెలిపారు. దుకాణంలోని ఉద్యోగులను విచారించగా.. రోజువారీ అమ్మకాలు దాదాపు రూ.50 లక్షలని చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News