Tuesday, March 3, 2026
Homeనిజామాబాద్‌Nizamabad Urban MLA | టీటీఏ వైద్య శిబిరం ప్రారంభం

Nizamabad Urban MLA | టీటీఏ వైద్య శిబిరం ప్రారంభం

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association-TTA) ఆధ్వర్యంలో ఇందూరు నగరంలోని అర్సపల్లి అంబేద్కర్ కాలనీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని (Medical Camp) నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) సందర్శించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే (Armoor Mla) పైడి రాకేష్ రెడ్డి(Paidi Rakesh Reddy)తో కలిసి పాల్గొన్నారు.

ఈ నెల 8 నుంచి 22 వరకు జరగనున్న టీటీఏ సేవా డేస్‌లో భాగంగా ఈ మెడికల్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం నిర్వాహకులను అభినందించారు. రక్తదానం (Blood Donation) చేసినవారికి, కార్యక్రమ నిర్వాహకులకు మెమెంటోలను, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి వైద్య పరీక్షలను నిర్వహించి, వారి ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News