రాష్ట్ర ఎదుగుదలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
- తెలంగాణ కొత్త రాష్ట్రం అయినా అభివృద్దిలో దూకుడు
- 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
- దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% ఉండాలనేది ఆశయం
- గాంధీ, అంబేద్కర్ సిద్దాంతాలే రాష్ట్ర అభివృద్ధి మార్గదర్శకాలు
- క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్ల అభివృద్ధి మోడల్ అమలు
- అభివృద్ధి ప్రయాణంలో గ్లోబల్ ఇన్వెస్టర్లు కీలక భాగస్వాములు
- పెట్టుబడులకు తెలంగాణ అన్ని విధాలుగా అనుకూలం
- ఘనంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ ప్రారంభం
- కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అతిథులను స్వాగతించిన రోబో.. రెండు రోజులపాటు 27 సెషన్లు.. చర్చల కోసం ప్రత్యేక వార్ రూమ్, డిజిటల్ స్క్రీన్లతో కలర్ఫుల్గా సమ్మిట్ ఏరియా…
అట్టహాసంగా సమ్మిట్ సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. వికసిత్ భారత్ దిశగా తెలంగాణ రైజింగ్.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్ష
తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్ అంటూ రాష్ట్ర ఎదుగుదలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నామన్నారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేదే తమ ఆశయమన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న ’ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు, అభిప్రాయాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10శాతం ఉండాలనేది తమ ఆశయమన్నారు. లక్ష్యం పెద్దది అయినప్పటికీ కష్టపడి సాధిస్తామనే నమ్మకం మాకుంది. అందరి సహకారంతో మా లక్ష్యాన్ని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో తెలంగాణ భవిష్యత్ విజన్‌ను స్పష్టంగా వివరించారు. దేశ భవిష్యత్ కోసం రాజ్యాంగ సభ ఏర్పాటు చేసి భారత రాజ్యాంగ నిర్మాతల దృష్టిని గౌరవించడం చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్దాంతాలే తెలంగాణ అభివృద్ధి మార్గదర్శకాలని ఆయన అన్నారు. విడిపోయిన తర్వాత ప్రజా పోరాటంతో సాధించిన ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ 2014లో సోనియా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో భారత పటంలో చోటు చేసుకుందని గుర్తు చేశారు.
గత దశాబ్దంలో రాష్ట్రం అత్యధిక అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగిందన్నారు. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికల కోసం నిపుణుల కమిటీ ఏర్పాటుతో ’తెలంగాణ రైజింగ్ 2047 విజన్’ను సిద్ధం చేసినట్లు సీఎం వెల్లడిరచారు. ఈ డాక్యుమెంట్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా రూపొందించబడిరదని, నీతి ఆయోగ్, నిపుణుల సూచనలు ప్రధాన పాత్ర పోషించాయని చెప్పారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడం ముఖ్య లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ జనాభాలో 2.9 శాతమే ఉన్నా.. దేశ జిడిపిలో 5 శాతం వాటా సాధించిన తెలంగాణ 2047 నాటికి దాన్ని 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం మొదటిసారి క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్ల అభివృద్ధి మోడల్‌ను అమలు చేస్తున్నామన్నారు. చైనా గ్వాంగ్డాంగ్ మోడల్‌ను ఆదర్శంగా తీసుకొని..

జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల పోటీ స్థాయికి తెలంగాణను తీసుకెళ్లే ప్రణాళిక ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో గ్లోబల్ ఇన్వెస్టర్లు కీలక భాగస్వాములని.. వారికి ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతున్నట్లు సీఎం అన్నారు. కష్టం అయితే వెంటనే చేయండి.. అసాధ్యమైతే డెడ్‌లైన్ పెంచుతాం అని సందేశం ఇచ్చారు. ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించాం. వాటిని సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించాం. క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా పిలుచుకుంటున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో సహకరించిన వారందరికి ఈ సందర్భంగా సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల సూచనలను ఆహ్వానిస్తున్నామన్నారు. దేశ స్వాతంత్యం అనంతరం మన నాయకులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ వేశారని వివరించారు.
అలాగే తాము సైతం తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలనుకున్నామన్నారు. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. రానున్న పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి.. 2047లో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని.. నాటికి మనం ఏం సాధించామో చెప్పాలని నిపుణులను కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ సమయంలోనే తెలంగాణ రైజింగ్2047 దార్శనికతకు బీజం పడిరదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
మనమేదైనా గొప్పగా చేయాలని భావించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో ముందుగా దేవుళ్ల ఆశీర్వాదం తీసుకుంటాం? ప్రజల మద్దతు కోరుతామన్నారు. భవిష్యత్తు కోసం మన కలలు నెరవేర్చుకోవడానికి ప్రజల ఆలోచనలు, అంచనాలు తెలుసుకున్నామన్నారు. అందుకు అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకున్నామన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు రావడం మన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులతోపాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులకు సీఎం రేవంత్ ధన్యవాదాలు చెప్పారు.
ఈ సమ్మిట్‌లో మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. మంచి సానుకూల వాతావరణం కూడా ఉందన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న రాష్ట్రాన్ని.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని తాము సంకల్పించామని చెప్పారు. దేశంలో తెలంగాణ దాదాపు 2.9శాతం జనాభా కలిగి ఉందని గుర్తు చేశారు. దేశ జీడీపీలో తెలంగాణ నుంచి దాదాపు 5శాతం వాటాను అందిస్తున్నామని స్పష్టం చేశారు. 2047 నాటికి భారత దేశ జీడీపీలో 10 శాతం వాటాను తెలంగాణ నుంచి అందిం చాలన్నది తమ లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం..
ఇలా తెలంగాణను మూడు భాగాలుగా విభజించి.. ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశిరచు కున్నామని వివరించారు. ఇలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే మొట్టమొదటిదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అందుకోసం కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ మోడల్స్ నిర్దేశించామని చెప్పారు. ఈ సందర్భంగా చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. చైనాలోనే ఈ ప్రావిన్స్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని తెలిపారు. 20 ఏళ్లలో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులతోపాటు వృద్ధి రేటు సాధించారని వివరించారు.
తెలంగాణలో సైతం తాము అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నామని చెప్పారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి తామేంతో ప్రేరణ పొందామన్నారు. ప్రస్తుతం ఆయా దేశాలతో తాము పోటీ పడాలనుకుంటున్నామని తెలిపారు. ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చు.. కానీ ఆ విజన్‌ను సాధించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమ టీమ్‌కు తాను చెప్పేదొక్కటేనన్నారు. కష్టంగా ఉంటే..వెంటనే చేపడుదాం. అసాధ్యం అని అనుకుంటే.. వారికి కొంత గడువు ఇస్తానని పేర్కొన్నారు. ఇవాళ తాను నిన్నటి కంటే ఎక్కువ విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నానన్నారు.
నిన్నటిది ఒక కల, ఒక ప్రణాళిక ఇవాళ మీరందరూ తమతో చేరారని.. ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తున్నామన్నారు. మీ అందరి మద్దతుతో తెలంగాణ రైజింగ్ లక్ష్యాలన్నింటినీ సాధించగలమని బలంగా విశ్వసిస్తున్నానన్నారు. ఈ తెలంగాణ రైజింగ్ నిరంతర పక్రియ..అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తూ.. తన ప్రసంగాన్ని ముగించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం ఈ సమ్మిట్ ప్రారంభ వేడుకలు ముగిశాయి. ఆనంతరం వివిధ రంగాలపై సదస్సులు ప్రారంభమైనాయి. సెమీకండక్టర్ రంగంపై చర్చలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. విద్యా రంగంలో గ్లోబల్ సెంటర్‌గా తెలంగాణ చర్చ గోష్టిలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.
