Thursday, March 5, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | అధికారం - అవినీతిపై ఆత్మజ్వాల

Aaj Ki Baath | అధికారం – అవినీతిపై ఆత్మజ్వాల

రాజకీయపు చీకటి నీడలో చేరిన బానిసత్వం, అధికారం ఇచ్చేవాని కాళ్ళకు రాసే కైంకర్యం! స్వార్థపు సంకెళ్ళకు సన్మానం చేస్తూ, నీతిని, నిజాయితీని పాతిపెట్టిన దుర్మార్గం. కులమతాల కుంపటిలో జాతీయత కాలి బూడిదై, మానవత్వం మరుగునపడి వైరం పెంపొందించే పిడివాదం! శిథిలమైన సమాజంలో చిరునవ్వులు దొంగిలించబడి, మన చేతులతోనే మన భవిష్యత్తుని నరకడం. జ్వలించు ఆత్మ! ఈ దరిద్రపు సంస్కృతిని దహించు! లేదంటే, ఈ దేశానికి ఇంకో విముక్తి దొరకదు!

  • సౌరం జితేందర్

- Advertisement -
RELATED ARTICLES

Latest News