జాగృతి జనం బాట(Jagruthi Janam Baata)లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం(Medchel Constituency)లోని నాగారంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. స్థానిక ప్రజలతో కలిసి మురికికూపంగా మారిన నాగారం నాలా(Nagaram Nala)ను పరిశీలించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ (Dumping yard) సందర్శించారు. బండ్లగూడ ఆర్జీకే కాలనీలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను (Double Bedroom Houses) పరిశీలించారు. దమ్మాయిగూడ నాలాను అద్దంలా చేస్తా అని కొబ్బరికాయ కొట్టిన రేవంత్ రెడ్డి ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదని విమర్శించారు. నాగారం బస్తీ బాట చేపట్టారు. లక్ష్మాపూర్ గ్రామ రైతులతో సమావేశమయ్యారు.
- Advertisement -
