- మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్..
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శివ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం పెద్దమందడి మండలం మన్నిగిళ్ళ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శివ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎమ్మెల్యే మెగా రెడ్డి ప్రత్యేక చరవతో మణిగిల్ల గ్రామానికి దాదాపుగా 36 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని, గ్రామంలో రేషన్ కార్డు ద్వారా అన్ని కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నారని అన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు సన్నబడ్లకు 500 బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు.

మాజీ కౌన్సిలర్ బ్రహ్మం చారి మాట్లాడుతూ..
గత ప్రభుత్వంలో శివ యాదవ్ ను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలు గురి చేశారని, పోలీసుల దెబ్బల వల్ల రెండు నెలలు నిర్వహించిన స్థితిలో ఉన్నాడని అన్నారు. గ్రామంలో ఉన్న నియంత పాలను రూపుమాపాలంటే సర్పంచ్ అభ్యర్థిగా నిలుచున్న శివ యాదవ్ ను గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు.

ప్రజా వైద్యులు డాక్టర్ పగడాల శ్రీనివాస్ మాట్లాడుతూ..
మణిగిల్ల గ్రామం అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ అభ్యర్థి శివ యాదవ్ ను వారి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాలను గ్రామ ప్రజలకు చేరే విధంగా శివ యాదవ్ స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తారని పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
