రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry Of Defence) పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO)లో 764 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. డీఆర్డీఓలోని సెంటర్ ఫర్ పర్సనల్ ట్యాలెంట్ మేనేజ్మెంట్ (CEPTAM) ఈ నియామక ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. ఇందులో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ(Senior Technical Assistant-B) పోస్టులు 561, టెక్నీషియన్-ఏ(Technician-A) ఖాళీలు 203 ఉన్నాయి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ కొలువుకి వేతనం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఇస్తారు. టెక్నీషియన్-ఏ ఉద్యోగానికి శాలరీ రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఇస్తారు. ఈ నెల 9 నుంచి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. వివరాలకు www.drdo.gov.inను సందర్శించొచ్చు.
- Advertisement -
