Saturday, March 14, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంTummala | తుమ్మల.. దీనులకు దేవుడిలా..

Tummala | తుమ్మల.. దీనులకు దేవుడిలా..

  • అలుపెరగని యోధుడు.. పదవులకే వన్నె తెచ్చిన నాయకుడు..
  • నలుగురు సీఎంలతో కలిసి పనిచేసిన సుదీర్ఘ అనుభవం
  • ఎవరికీ దక్కని గౌరవం ఆయన సొంతం

కొత్తగూడెం డిసెంబర్ 2(ఆదాబ్ హైదరాబాద్): ప్రజాసేవ(Public Service) ఆయన ఊపిరి. సమస్య (Problem) వచ్చిందని ఆయన్ని ఆశ్రయిస్తే చాలు.. అది పరిష్కారమయ్యే వరకు విశ్రమించడు. పేద ప్రజల గుండెల్లో గుడి(Temple) కట్టుకున్న నాయకుడు(Leader). అలుపెరగని పోరాట యోధుడు. పదవులకే వన్నె తెచ్చిన నాయకుడు. క్యాబినెట్ (Cabinet) ఏదైనా విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో దిట్ట. ఎవరికీ దక్కని గౌరవం ఆయన సొంతం. తెలుగు గడ్డ ఖ్యాతిని దేశం నలుమూలలా చాటిన ఎన్టీఆర్‌(NTR)తో పనిచేసిన అనుభవం ఆయనది. ఎన్టీఆర్‌తోపాటు చంద్రబాబు(Chandrababu), కేసీఆర్(KCR), ఇప్పుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) క్యాబినెట్‌లో మంత్రి పదవులను అలంకరించి దేశంలోనే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆయనే.. తుమ్మల నాగేశ్వరరావు.

తుమ్మల నాగేశ్వరరావు.. ఆదాబ్ హైదరాబాద్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీ పంచాయతీ పరిధిలోని కాకతీయ స్కూల్ ఆఫ్ మైన్స్‌ను డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మార్చిన సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవాకి కొత్తగూడెం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆదాబ్‌’తో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. అనేక విషయాలను పంచుకున్నారు.

- Advertisement -

‘ఎన్టీఆర్ క్యాబినెట్‌లో చిన్న తరహా నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశాను. చంద్రబాబు మంత్రివర్గంలో భారీ నీటి పారుదల, ఎక్సైజ్ శాఖ, కేసీఆర్ క్యాబినెట్‌లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశాను. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో(రేవంత్ మంత్రివర్గంలో) వ్యవసాయ, మార్కెటింగ్, జౌళి, చేనేత శాఖల మంత్రిగా చేస్తున్నాను. దేశంలో ఎవరికీ దక్కని గౌరవం, గుర్తింపు నేను పొందటం నా అదృష్టం. పేద ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. ప్రజల సమస్యలను పరిష్కరించడమే నా ధ్యేయం. పదవి ఏదైనా దానికి న్యాయం చేసేందుకు అహర్నిశలు కృషి చేశా. చేస్తూనే ఉంటా. ప్రజాసేవ దేవుడు నాకిచ్చిన వరం.

ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా నా అభివృద్ధి గురుతులే కనిపిస్తాయి. చెప్పుకుంటూ వెళ్తే లెక్కలేనన్ని అభివృద్ధి పనులు చేశా. చేస్తూనే ఉన్నా. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సూచనలు, సలహాల మేరకు డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు నాంది పలికాం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఒక్కో రాష్ట్రలో ఒక్కో సబ్జెక్టుకు బోధనలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మాత్రం దేశంలోని అన్ని సబ్జెక్టులకు బోధనలు ఉంటాయి. నేను ఏ సీఎం క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసినా ఆ పదవికి వన్నె తెచ్చేలా ముందుకెళ్తున్నా. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూనే ఉంటా.

- Advertisement -
RELATED ARTICLES

Latest News