Thursday, March 12, 2026
HomeజాతీయంParliament | సర్ ఆందోళనలు

Parliament | సర్ ఆందోళనలు

ఉభయ సభల్లో చర్చకు పట్టుపట్టిన విపక్ష నేతలు

  • గందరగోళం మధ్య లోక్‌సభ నేటికి వాయిదా
  • సంచార్‌ సాథి యాప్‌పై కూడా ప్రకంపనలు
  • ప్రజల ప్రైవసీని దెబ్బతీసేదని మండిపడ్డ విపక్షం
  • దీనిని వెంటనే తొలగించాలని డిమాండ్‌
  • అసవరం లేకుంటే తొలగించవచ్చన్న సింధియా

ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్‌ ఉభయసభలు దద్ధరిల్లాయి. ఓట్‌ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. ఫలితంగా ఉభయసభల్లో గందరగోళం నెలకొన్నది. లోక్‌సభను కంట్రోల్‌ పెట్టేందుకు స్పీకర్‌ ఓంబిర్లా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో స్పీకర్‌ ముందుగా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. దాంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడిరది.

- Advertisement -

మధ్యాహ్నం రెండు గంటలకు సభ పునఃప్రారంభ మైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. గందరగోళం కొనసాగింది. దాంతో స్పీకర్‌ సభను బుధవారానికి వాయిదా వేశారు. అంతకుముందు ప్రతిపక్ష సభ్యులు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి ఓట్లు దోచిపెట్టే పని చేస్తున్నదని విమర్శించారు.

ప్రజల ప్రైవసీని దెబ్బతీసేదిని మండిపడ్డ విపక్షం

పార్లమెంట్‌లో సంచార్‌ సాథీపై అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్‌, శివసేన, తదితర పార్టీలు దీనిని తీవ్రంగా విమర్శిస్తూ ఇది.. ప్రజల ప్రైవసీ ఉల్లంఘనే అంటూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడిరది. విపక్ష కాంగ్రెస్‌ దీని మీద వాయిదా తీర్మానం దాఖలు చేసి సంచార్‌ సాథీపై విస్తృత చర్చ కావాలని డిమాండ్‌ చేసింది. సంచార్‌ సాథీ యాప్‌.. ఫోన్‌ యూజర్ల కదలికల్ని, మెసేజెస్‌, కాల్స్‌ మానిటర్‌ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ దీనిని ఇదొక డిస్టోపియన్‌ టూల్‌ అని..

ఇది ప్రతి భారతీయుడిని మానిటర్‌ చేయడమే కాకుండా.. వారి ఆర్థిక హక్కులపై దాడిగా అభివర్ణించారు. దీని అమలు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. కాంగ్రెస్‌ ఎంపి రేణుక చౌదరి దీనిపై వాయిదా తీర్మానం దాఖలు చేశారు. మరో ఎంపిప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ఇది ఒక దారుణమైన పరిణామమని.. ఇది భవిష్యత్‌లో నియంతృత్వానికి దారితీస్తుందన్నారు. ప్రజల గోప్యతను హరిస్తుందన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాగరిక ఘోష్‌ కూడా దీనిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ప్రభుత్వంపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుందని విమర్శించారు.

విపక్షాల ఆందోళన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు.. సంచార్‌ సాథీ యాప్‌ పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంచార్‌ సాథీ మీద చర్చకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ ఎజెండా ప్రకారం సెషన్‌లో 14 బిల్లులపై ఫోకస్‌ పెడదామని సూచించారు. అటు, డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ టెలికామ్‌ కూడా దీనిపై స్పందించింది. సంచార్‌ సాథీ కేవలం ప్రజల సైబర్‌ సెక్యూరిటీ కోసం ఉద్దేశించింది మాత్రమేనని, ఇందులో ప్రైవసీ ఉల్లంఘన లేదంది. ఈ యాప్‌ యూజర్‌ డేటా రక్షిస్తుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా కీలక ప్రకటన చేశారు.

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు తమ మొబైల్‌ నుంచి సంచార్‌ సాథీ యాప్‌ను డిలీట్‌ చేసుకోవచ్చని చెప్పారు. ఆ యాప్‌ తప్పనిసరి కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇండియాలో స్మార్ట్‌ఫోన్లు తయారు చేసే కంపెనీలకు ఇటీవల కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. కచ్చితంగా స్మార్ట్‌ఫోన్లలో ప్రభుత్వ సంబంధిత సంచార్‌ సాథీ యాప్‌ను ప్రీ`ఇన్‌స్టాల్‌ చేసి ఉంచాలని పేర్కొన్నది. ఆ ఆదేశాలను విపక్షాలు తప్పుపడుతున్నాయి. సంచార్‌ సాథీ యాప్‌ వల్ల గోపత్యకు భంగం కలిగే అవకాశాలు ఉన్నట్లు విమర్శలు చెబుతున్నారు. భారత్‌లో విక్రయించే అన్ని మొబైళ్లలో ప్రభుత్వం రూపొందించిన సైబర్‌ సెక్యూరిటీ యాప్‌ సంచార్‌ సాథీని డిఫాల్ట్‌గా అందించాలని కేంద్రం మొబైల్‌ తయారీ సంస్థలను ఆదేశించింది.

దీనిపై సోమవారం రాత్రి పీఐబీ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. ఈ ఆదేశాల అమలుకు 90 రోజుల గడువు ఇచ్చిన కేంద్రం.. దానికి సంబంధించి 120 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రెస్‌నోట్‌లో స్పష్టం చేసింది. దీనిపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కేంద్రం వెనక్కి తగ్గింది. ఇది తప్పనిసరి కాదని వెల్లడిరచింది. ఆ యాప్‌ను డిలీట్‌ చేసుకోవచ్చని చెప్పింది. అయితే దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్తున్నారని కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంకాగాంధీ దుయ్యబట్టారు. ఫోన్లపై నిఘానో, సంచార్‌ సాథీ యాప్‌ విషయమో కాదు..

అన్ని అంశాల్లో వారి వైఖరి అలాగే ఉందని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది పెగాసస్‌ ప్లస్‌ప్లస్‌. బిగ్‌ బ్రదర్‌ మన ఫోన్‌ను, మొత్తం మన ప్రైవేటు జీవితాన్ని స్వాధీనం చేసుకుంటాడని కాంగ్రెస్‌ నేత కార్తి చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే విపక్షాలు పార్లమెంట్‌ సమావేశాలకు అంతరాయం సృష్టించొద్దని, అన్ని అంశాలపైనా చర్చించేందుకు సిద్ధమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ఆ విమర్శలను తోసిపుచ్చారు. కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఆ యాప్‌ను వాడాలనుకోకపోతే.. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులు దానిని తొలగించే ఆప్షన్‌ ఉందని వెల్లడిరచారు. మీరు దానిని కొనసాగించాలని అనుకుంటే..

మీ ఫోన్‌లో ఉంచుకోవచ్చు. డిలీట్‌ చేయాలనుకుంటే చేసేయొచ్చు. మీరు ఫోన్‌ కొనుగోలు చేసినప్పుడు ఎన్నో యాప్‌లు ముందుగానే ఇన్‌స్టాల్‌ అయి ఉంటాయి. అవి వద్దనుకుంటే తొలగించుకుం టాం కదా. ఇది యూజర్ల రక్షణకు సంబంధించిన అంశం. ఇందులో తప్పనిసరి ఏమీ లేదు. మీరు రిజిస్టర్‌ కాకపోతే.. అది అచేతనంగా ఉండిపోతుంది. డిలీట్‌ కూడా చేసుకోవచ్చు. అయితే మోసం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఒక యాప్‌ ఉందని ప్రతిఒక్కరికీ తెలియదు. కాబట్టి ఆ సమాచారాన్ని వెల్లడి చేయడం ప్రభుత్వ బాధ్యత‘ అని మంత్రి వెల్లడిరచారు. ఫోన్‌ తయారీదారులకు ఆదేశాలు జారీ చేయడం వెనకగల కారణం ఇదేనన్న ఉద్దేశంలో సమాధానం ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News