- ఒక మహిళ.. ఒక సంకల్పం.. ఒక లక్ష్యం..
భిక్కనూర్ అనే గ్రామాన్ని కేవలం జీవన స్థలంగా కాకుండా, అభివృద్ధి పండుగలా మార్చాలన్న ఆమె తపన.. ఒక్క సమస్య కనిపించిన వెంటనే పరిష్కారం కోసం అడుగులు వేయాలన్న ఆమె ధైర్యం..ఊరిని ముందుకు నడిపే పట్టుదల, ప్రజల పట్ల ఉన్న ప్రేమ, గ్రామాన్ని కుటుంబంగా చూసే ఆప్యాయత..ఇవన్నీ కలిసి ఆమెను భిక్కనూరులో ఎంతో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అభివృద్ధి అనేది కేవలం ప్రణాళిక కాదు..అది ఒక భావన..ఒక బాధ్యత..ఒక సంకల్పం..దానిని అమలులో పెట్టడానికి ముందుండే పేరు అందె జయమ్మ..
భిక్కనూర్, పేరుకే గ్రామం, పట్టణానికి ఏ మాత్రం తీసిపోని విధంగా పది వేల ఓటర్లతో, పక్క గ్రామాలన్నింటికి ఆర్థిక లావాదేవీలకు కేంద్రంగా నిలిచిన ఈ ఊరు, అభివృద్ధి పరంగా ఇంకా గ్రామ హోదాలోనే ఆగిపోయింది..ఈ స్థితిని మార్చి భిక్కనూరును నిజమైన అభివృద్ధి పథంలో నడిపించాలని సంకల్పించిన వ్యక్తి అందె జయమ్మ…గ్రామ సమస్యల్ని భుజాన వేసుకుని, పరిష్కారాల దిశగా అడుగులు వేసే దైర్యం ఆమె స్వభావం ..యువత నుంచి పెద్దల వరకు అందరిని కలుపుకొని గ్రామమే తన కుటుంబమన్న భావన ఆమెది.. అభివృద్ధిని పండుగలా చేయాలన్న తపన ఆమెది ,ఇవన్నీ జయమ్మ పాత్రను భిక్కనూరులో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
ఒక గ్రామం ఎలా మారాలి? ఎలా ఎదగాలి? అన్న ప్రశ్నలకు సమాధానంగా నిలిచే మార్గదర్శకత్వమే ఆమె సంకల్పం. ఈ ప్రాంతంలో ముఖ్యంగా కోతుల బెడదతో ప్రజలు రోజువారీగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గ్రామం బలంగా కోరుతోంది.ఈ నేపథ్యంలో, గ్రామ అభివృద్ధి పట్ల నిబద్ధతతో ముందుకొచ్చిన వ్యక్తి అందె జయమ్మ. భిక్కనూర్ సహకార సంఘం డైరెక్టర్‌గా రైతులకు ఎరువులు,విత్తనాల సరఫరా నుంచీ, వ్యవసాయానికి అవసరమైన సదుపాయాల కల్పన వరకు అందె జయమ్మ చేయూత అందిస్తున్నారు.
మరోవైపు, గ్రామంలో వ్యసనాలపై అవగాహన కల్పిస్తూ, భజన మండలి ద్వారా దైవభక్తి,దేశభక్తి విలువలను పాటల ద్వారా ప్రజల్లో నాటుతున్నారు. ఏ సమస్య కనిపించినా అక్కడే ప్రశ్నించే ధైర్యం.. గ్రామానికి పెద్దమ్మలా నిలిచే నిష్ఠ.. ఆమె శైలిని స్పష్టంగా చెబుతాయి. యువత ఆలోచనల్ని మార్చడం, గ్రామాన్ని ఆధ్యాత్మిక,సాంస్కృతికంగా బలోపేతం చేయడం, యోగా, మెడిటేషన్ కార్యక్రమాల ద్వారా ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడం, ఇవి అన్నీ జయమ్మ కార్యక్రమాల ప్రధాన లక్ష్యాలు. గ్రామ అభివృద్ధి కోసం వ్యక్తిగత లాభం లేకుండా పనిచేయడం తన జీవితపు ధ్యేయమని ఆమె చెప్పే తీరు ప్రత్యేకం.
కుటీర పరిశ్రమలు, స్టార్టప్స్, భిక్కనూరును అభివృద్ధి దిశగా తీసుకెళ్లే బాట
భిక్కనూరులో కుటీర పరిశ్రమలకు పెను అవకాశం ఉందని జయమ్మ చెబుతున్నారు. యువతకు స్టార్టప్స్‌పై అవగాహన కల్పించి, ప్రభుత్వం దగ్గర ఉన్న ఖాళీ భూముల్లో ఉద్యానవన,వ్యవసాయ పంటలను ప్రోత్సహిస్తే గ్రామానికి ఆర్థిక ప్రవాహం పెరుగుతుందని, కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని ఆమె అభిప్రాయం.యువత గ్రామాలు వదిలి వెళ్లకుండా, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి, స్వయం ఉపాధికి దారులు వేయాలన్నదే ఆమె ప్రణాళిక.
పర్యాటకం.. భిక్కనూరులో ఉన్న అపార అవకాశాలు
స్వయంభూ లింగం సిద్ధరామేశ్వర ఆలయం, గుడి ముందు రాతిమెట్ల కొలను, పోచారం వన్యప్రాణుల అభయారణ్యం, మినీ ఊటీ లా కనిపించే ప్రాంతాలు,ఇవన్నీ కలిసి భిక్కనూరును పర్యాటక హబ్‌గా మార్చే శక్తి ఉన్నాయని జయమ్మ భావిస్తున్నారు. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉండటం కూడా గ్రామానికి పెద్ద అదృష్టం.
యువతను మాదకద్రవ్యాల నుంచి దూరం చేసే ప్రయత్నం
నేటి యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ , మాదక ద్రవ్యాల సమస్యపై ఆమె తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆటలు, సాహిత్యం, సంగీతం వైపు మళ్లించేందుకు క్రీడా క్లబ్‌లు, కళా,సాహిత్య భవనాలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఆమెది.
భిక్కనూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా..
పాడి, వ్యవసాయాల్లో పెట్టుబడులు పెంపొందించి, హైదరాబాద్‌కు పాలు, పండ్లు, కూరగాయలు, మాంసం సరఫరా చేసే కేంద్రంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో జయమ్మ ముందుకు సాగుతున్నారు.ప్రతి వీధిలో చెట్లు నాటి పరిశుభ్రతను కాపాడుతూ,ఇంటి ముందు ముగ్గు వేసుకున్నంత ప్రేమతో గ్రామాన్ని అలంకరించాలి అన్న ఆమె మాటల్లో గ్రామాభిమానం స్పష్టంగా కనిపిస్తుంది. కుల, మత భేదాలు లేకుండా సహృద్భావాన్ని పెంచడం, ప్రజల్లో ఏకతను నెలకొల్పడం, గ్రామ ఉత్పత్తులను దేశీయ,అంతర్జాతీయంగా మార్కెట్ చేయడం..
ఇవన్నీ కలిపి తెలంగాణ 3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాల్లో భిక్కనూరును భాగస్వామ్యం చేయాలన్నదే ఆమె అంతిమ స్వప్నం. అందుకే.. ఆమెను అంతగా అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు..ఆమెలో వారు నాయకుణ్ణి కాదు..ఊరి సమస్యను తమ సమస్యగా భావించే మనిషిని చూస్తున్నారు.తమ ఊరిని తమకంటే ఎక్కువగా ప్రేమించే బాధ్యతను చూస్తున్నారు.అభివృద్ధి కోసం మాటలు కాదు..అడుగులు వేస్తున్న చేతులను చూస్తున్నారు.భిక్కనూరు ప్రజలకు ఆమెఫై ఉన్నది కేవలం అభిమానమే కాదు..ఒక నమ్మకం. ఒక విశ్వాసం. ఒక బంధం.అవే ఇప్పుడు ఆమెను ప్రజాప్రతినిదిగా ఒక స్థానంలో నిలబెడుతున్నాయి.. సర్పంచ్ గా గెలుపు బాటలో నడిపిస్తున్నాయి.
