Saturday, February 14, 2026
Homeబిజినెస్GST Collections | 0.7 శాతం పెరిగిన స్థూల జీఎస్టీ వసూళ్లు

GST Collections | 0.7 శాతం పెరిగిన స్థూల జీఎస్టీ వసూళ్లు

స్థూల వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు గతేడాది నవంబర్‌తో పోల్చితే ఈ ఏడాది నవంబర్‌లో 0.7 శాతం పెరిగాయి. 2024 నవంబర్‌లో రూ.1,69,016 కోట్లు రాగా 2025 నవంబర్‌లో రూ.1,70,276 కోట్లు వచ్చాయి. అన్ని రిఫండ్లు (Refunds) పోను నికర జీఎస్టీ రెవెన్యూ (Net Gst Revenue) రూ.1,52,079 కోట్లు వసూలయ్యాయి. ఇది పోయినేడాది నవంబర్ కన్నా 1.3 శాతం ఎక్కువ. కిందటేడాది నవంబర్‌లో రూ.1,50,062 కోట్లు కలెక్ట్ అయ్యాయి.

ఇందులో.. గ్రాస్ డొమెస్టిక్ రెవెన్యూ రూ.1,24,300 కోట్లు కాగా 2024 నవంబర్ కన్నా 2.3 శాతం తక్కువ. సీజీఎస్టీ (CGST) రూ.34,843 కోట్లు, ఎస్‌జీఎస్టీ(SGST) రూ.42,522 కోట్లు, ఐజీఎస్టీ(IGST) రూ.46,934 కోట్లు. దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం భారీగా పెరిగింది. గ్రాస్ ఇంపోర్ట్ రెవెన్యూ(IGST) రూ.45,976 కోట్లకు చేరింది. కిందటేడాది (రూ.41,736 కోట్ల) కన్నా ఇది 10.2 శాతం ఎక్కువ కావటం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News