Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్CM Chandra Babu | పెన్షన్ల పంపిణీలో ఏపీ నంబర్ వన్

CM Chandra Babu | పెన్షన్ల పంపిణీలో ఏపీ నంబర్ వన్

సీఎం చంద్రబాబు ఇవాళ ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పేదల సేవలో ప్రజా వేదిక (Pedala Sevalo Praja Vedika) కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని ప్రజలను కోరితే అంతా కలిసి అనూహ్యమైన మద్ధతు ఇచ్చినట్లు తెలిపారు. 164 సీట్లలో కూటమి అభ్యర్ధులను గెలిపించి మా బాధ్యతను పెంచారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్‌(Super Six)ను కొందరు ఎగతాళి చేశారు. కానీ ప్రజల మద్దతుతో దాన్ని సూపర్ హిట్ (Super Hit) చేసి చూపాం అని చెప్పారు. 18 నెలల్లో ఒక్క పెన్షన్ల (Pensions) కోసమే రూ. 50,763 కోట్లను ఖర్చు పెట్టామని వెల్లడించారు. దేశంలో ఎవరూ ఈ స్థాయిలో సంక్షేమం ఇవ్వడం లేదని అన్నారు.

సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

  • పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, గుజరాత్ ఈ స్థాయిలో సంక్షేమం చేయటం లేదు.
  • ఏడాదికి రూ.33 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.1.65 లక్షల కోట్ల మేర వ్యయం చేస్తున్నాం.
  • ప్రతి నెలా 63 లక్షల పైచిలుకు మందికి వివిధ కేటగిరీల్లో పెన్షన్లు ఇస్తున్నాం.
  • పెన్షన్లలో 59 శాతం మహిళలకే ఇస్తున్నాం.
  • అసలు పెన్షన్లు ప్రారంభించిందే ఎన్టీఆర్.
  • దాన్ని పెంచింది కూడా మా ప్రభుత్వమే.
  • గత పాలకులు ముక్కుతూ మూలుగుతూ రూ.250 చొప్పున మాత్రమే పెంచారు.
  • ఒకేసారి రూ.4 వేల పెన్షన్ ప్రకటించి అమలు చేసింది కూటమి ప్రభుత్వమే.
  • తల్లికి వందనం (Thalliki Vandanam) కింద ప్రతి విద్యార్ధికీ రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయం తల్లుల ఖాతాలో వేశాం.
  • జనాభా సమతౌల్యం కోసం మనం ఆలోచన చేయాలి.
  • అప్పుడే దేశం, రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తాయి.
  • ఆడబిడ్డలు కష్టపడకుండా ఉండాలనే 3 ఉచిత గ్యాస్ సిలెండర్లను ప్రభుత్వం ఇస్తోంది.
  • రైతులు ధాన్యం విక్రయించిన 5-6 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తున్నాం.
  • స్త్రీ శక్తి ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికైనా వెళ్లేలా సదుపాయం కల్పించాం.
  • ఇప్పటివరకు మహిళలు 25 కోట్ల ప్రయాణాలు చేశారు.
  • రూ.855 కోట్ల మేర ఆర్టీసీకి చెల్లించాం.
  • 16,347 మందికి డీఎస్సీ ఉద్యోగాలు కల్పించాం.
  • అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకూ రూ.20 వేలు ఇస్తున్నాం.
  • ఇప్పటికే రూ.14 వేలు పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాలకు జమ చేశాం.
  • పంచ సూత్రాల ఆధారంగా వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
  • దానికి అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణ కూడా చేపట్టింది.
  • ప్రతి రైతునూ కలిసి అవగాహన కల్పిస్తున్నాం.
  • త్వరలోనే చింతలపూడి లిఫ్టును కూడా పూర్తి చేసి రైతులకు నీళ్లు అందిస్తాం
- Advertisement -
RELATED ARTICLES

Latest News