గుండెపోటుకు సంబంధించి శరీరం కొన్ని సంకేతాల(Signals)ను ముందే ఇస్తుంది. ఒళ్లు సత్తువ కోల్పోవటం (Weak), పనిచేస్తున్నప్పుడు ఇబ్బంది పడటం, తల (Head) తేలిపోయినట్లు అనిపించటం, సొమ్మసిల్లటం, ఎడమ చేతిలో సూదులు పొడుస్తున్నట్లు సూచనలు కనిపించటం, అకారణంగా చెమటలు (sweats) పట్టడం, మెడ చుట్టూ బిర్రుగా, నొప్పి(Pain)గా అనిపించటం, రెస్ట్ తీసుకునేటప్పుడు ఛెస్ట్లో హాయిగా అనిపించటం, నడిచేటప్పుడు గుండె వేగంగా కొట్టుకోవటం వంటివి గుండెపోటుకు సంకేతాలు.
ప్రతి ఐదుగురిలో ఒకరు ఐదేళ్ల వ్యవధిలో రెండోసారి హార్ట్ఎటాక్ బారినపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. లైఫ్ స్టైల్(LifeStyle)ను మార్చుకోవటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. శారీరకం(Physically)గా బద్ధకంగా ఉంటే మాత్రం గుండెపోటు నుంచి తప్పించుకోలేరు. సరిపోయినంత నిద్రపోవటం, రోజుకు కనీసం అర్ధగంటసేపైనా వాకింగ్ (Walking) చేయటం ద్వారా హార్ట్ ఎటాక్ బారి నుంచి బయటపడొచ్చు. ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే ఇంకా డేంజర్.
