Sunday, March 1, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంVikarabad Mpdo Office | ప్రభుత్వ కార్యాలయాలా?.. రెస్టారెంట్లా..?

Vikarabad Mpdo Office | ప్రభుత్వ కార్యాలయాలా?.. రెస్టారెంట్లా..?

  • ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులే వంట మనుషులా?
  • బడా నాయకుల అండతో తాము ఆడిందే ఆట.. పాడింది పాటగా.. ఆధిపత్యం
  • ఉన్నతాధికారులకు తెలిసినా.. చర్యలు తీసుకోవడంలో వెనకడుగు..
  • ప్రభుత్వ కార్యాలయాన్ని వంటగదిగా చేసిన అధికారులపై ప్రజల విమర్శలు

ప్రభుత్వ కార్యాలయాన్నే (Government Office) వంట గది(Kitchen)గా మార్చి రోజుకో వంట రుచితో ఆహారాన్ని (Food) ఆరగిస్తున్న ఘటన వికారాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతోంది. పట్టణ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విధులకు హాజరవుతూ కార్యాలయంలోనే భోజనం వండించుకొని తింటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సొంత ఇంట్లో (Own House) ఎలా అయితే రుచికరమైన భోజనం వండించుకొని తింటామో అదే విధంగా ప్రభుత్వ కార్యాలయంలో కూడా రుచికరమైన భోజనం కావాలనేది ఆ సారు ఉద్దేశమో ఏంటో గానీ కార్యాలయంలో వండించుకొని రోజుకో రుచి చూస్తున్నారని వికారాబాద్ పట్టణ ప్రజలు (Talk Of The Town) చర్చించుకుంటున్నారు.

- Advertisement -

ఓ బడా నాయకుడి అండదండలతో కార్యాలయంలో తాను ఆడిందే ఆట పాడిందే పాటగా విధులు నిర్వహిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని తన రెస్టారెంట్‌(Restaurant)గా మార్చుకొని వంటలు వండించుకొని తినడంపై వికారాబాద్ పట్టణవాసులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

నవాబ్‌పేట్ తహశీల్దార్ కార్యాలయం(Nawabpet Tahsildar’s Office)లోనూ అదే తీరు..

నవాబ్‌పేట్ తహశీల్దార్ బుచ్చయ్య బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిని(Attender-అటెండర్)తో తహశీల్దార్ కార్యాలయంలోనే వంటలు వండిస్తూ కార్యాలయ సిబ్బంది, తాను తింటున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగినిని వంట మనిషిగా వంటలు చేయించడం చూసిన వారందరూ తహశీల్దార్‌పై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను వంట గదులుగా మార్చిన ఎంపీడీవో, తహశీల్దార్‌పై అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా వారికే వత్తాసు పలుకుతారా అనేది వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News