సీఎం సహకారంతో MLA కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి
ఇళ్లు లేని అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు
TPCC సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
పేదల సొంతింటి కలను నేరవేర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిందని టీపీసీ సభ్యుడు (Tpcc Member) అయిళ్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజారంజక పాలనను ప్రజలు (Public) స్వాగతించారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం (Indiramma Rajyam) తెచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కే దక్కుతుందని తెలిపారు. ప్రజాపాలనలో ప్రతిఒక్కరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
కల్వకుర్తి (Kalvakurthy) నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సహకారం, MLA కసిరెడ్డి నారాయణ రెడ్డి (Kasireddy Narayana Reddy) ఆధ్వర్యంలో వందల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వ్యం పదేళ్లలో ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన కూడా పోలేదని విమర్శించారు. అర్హులైన అందరికీ MLA సారథ్యంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేయిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కడ్తాల్ మండలం కర్కల్ పహాడ్ గ్రామంలో ఉడుతల నీలా మల్లేష్ దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా భూమి పూజలో ముఖ్య అతిధిగా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి నేనావత్ బిక్య నాయక్, పంచాయతీ కార్యదర్శి జంగయ్య, జిల్లా నాయకులు జాటోవత్ జవహర్ లాల్ నాయక్, రంగారెడ్డి జిల్లా కో-కోఆర్డినేటర్ విష్ణు, అయోధ్య, ఇందిరమ్మ కమిటీ మెంబర్ సయ్యద్ జలాలుద్దీన్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ పట్నం శివరాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు తుల్సి రాం నాయక్, మల్లేష్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
