నర్సంపేట: నర్సంపేట పట్టణానికి చెందిన సమాజ సేవకులు, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు అయిన “బెజ్జంకి ప్రభాకర్” ను బాలల హక్కుల, బాలల సమస్యల పరిష్కారం, బాలల సమగ్ర పరి రక్షణ కొరకు చేస్తున్న నిరంతర కృషి కి గుర్తు గా స్థానిక మదర్స్ ల్యాండ్ హైస్కూల్ యాజమాన్యం తరపున పాఠశాల కరెస్పాండంట్ పాశికంటి రమేష్ మరియు ప్రిన్సిపాల్ నవిత లు శాలువా, షిల్డ్ తో ఘనంగా సన్మానించారు. సందర్బంగా స్వయంకృషి సంస్థ నిర్వాహకులు “బెజ్జంకి ప్రభాకర్” మాట్లాడుచు పిల్లలు దేవుని ప్రతిరూపాలని అలాంటి బాలలకు సేవ చేయడం అదృష్టం గా భావిస్తున్నట్లు తెలియజేశారు.
అభం శుభం తెలియని చిన్నారి బాలలు ప్రతీ రోజు ఏదో ఒక మూల వేధింపులకు, హింస లకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలల కొరకు ప్రత్యేకమైన బాలల చట్టాలు ఉన్నాయని తెలిపారు ఆపద సమయంలో “చైల్డ్ హెల్ప్ లైన్-1098 మరియు పోలీస్ -100” టోల్ ఫ్రీ నంబర్స్ ను వినియోగించుకోవాలని కోరినారు. ప్రతీ ఒక్కరు బాలల రక్షణకు, బాలల సేవలకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, బాలబాలికలు పాల్గొన్నారు.
