- ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పైసా గణేష్
గురువారం రోజున కలెక్టర్ ఆఫీస్ లో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల తీరుతెన్నల పైన కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడానికి వెళ్లిన విద్యార్థి సంఘ నాయకులపై సీఐ భౌతిక దాడులు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పైసా గణేష్ మాట్లాడుతూ, విద్యార్థి సంఘాలపై ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని అన్నారు.
అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు మాట్లాడిన తీరుతెనుల గురించి కలెక్టర్ దగ్గరికి వెళ్లి చెప్పడానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘాలను పట్టించుకో పోగా సుమారు నాలుగు గంటల పాటు ఆఫీసు నందు నిలబెట్టడం సరికాదన్నారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం పోలీసులు జోక్యం చేసుకొని విద్యార్థి సంఘాల నాయకుల పైన ఇష్టానుసారం భౌతిక దాడులు చేస్తూ పిడుగులు గుద్దుతూ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం ఏమాత్రం సరికాదన్నారు. ఇక మీదనైనా ప్రజా పాలన ప్రజాస్వామ్యంలో నిబద్ధతగా ఉండాలని అన్నారు. అదేవిధంగా భౌతిక దాడులకు దిగిన సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అరుణ్, మహేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
