కరీంనగర్ జిల్లాలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులను (Government Teachers) డీఈఓ (Deo) సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రవీణ్ కుమార్, ఇదే పాఠశాలలో ఫిజికల్ సైన్స్ బోధించే సమ్మయ్య, హుజురాబాద్ మండలం చెల్పూర్ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్ ఐలయ్యపై వేటు వేశారు.
ప్రవీణ్ కుమార్, సమ్మయ్య.. మద్యం (Liquor) సేవించి పాఠశాలకు హాజరైనట్లు ఆరోపణలు రావటంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఐలయ్య.. విధుల పట్ల నిర్లక్ష్యం (Negligency) వహించడం, ఉన్నతాధికారుల (Higher Officials) ఆదేశాలను పట్టించుకోకపోవడం, పాఠశాల కార్యక్రమాల్లో సహకరించకపోవడం, విద్యార్థులను డిస్కరేజ్ (Discourage) చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ముగ్గురు టీచర్లు ప్రవర్తన మార్చుకోకుండా పదే పదే ఇవే చర్యలకు పాల్పడటంతో కలెక్టర్ ఆదేశాలతో సస్పెండ్ చేసినట్లు డీఈవో వెల్లడించారు.
