- కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గానికి ఘన సన్మానం రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో
జర్నలిస్టులు సమాజ నిర్దేశకులని రెడ్డి సంఘాల నాయకులు అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు వారధిలా పనిచేస్తున్నారని కొనియాడారు. మంగళవారం స్థానిక వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లా శాఖ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గాన్ని వారు అభినందించి, శాలువలతో సత్కరించారు. డబ్ల్యూజెఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి సత్యనారాయణ పాల్గొనగా,ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో డబ్ల్యూజెఐ నూతన అధ్యక్షుడు దారం జగన్నాథరెడ్డి, ఉపాధ్యక్షుడు మొగురం రమేష్,కోశాధికారి చిట్టిమళ్ళ మహేందర్, సంయుక్త కార్యదర్శి గంగిపల్లి రమేష్, కార్యవర్గ సభ్యులు ఏనుగు శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ తదితరులను శాలువాలతో సన్మానించారు.
డబ్ల్యూజేఐ నూతన కార్యవర్గం జర్నలిస్టుల ఐక్యత,హక్కుల సాధన కోసం కృషి చేస్తుందనే ఆశాభవాన్ని రెడ్డి నాయకులు వ్యక్తం చేశారు.కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పత్రికా రంగంలో సేవలు, యూనియన్ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు పరస్పరం చర్చించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు కాసర్ల మధుకర్ రెడ్డి, భూంపెల్లి రాఘవ రెడ్డి, రేకులపెల్లి రవీందర్ రెడ్డి, , జున్నుతుల రాజిరెడ్డి, వాడే వెంకట్ రెడ్డి, చెన్నాడి రాజేశ్వర్ రెడ్డి, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, న్యాలకొండ ప్రసన్నకుమార్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, దత్తాత్రేయ రెడ్డి,ఏడవెల్లి శశిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
