Wednesday, January 14, 2026
EPAPER
Homeరంగారెడ్డిHonor | పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయురాలు.

Honor | పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయురాలు.

  • మాజీ ఎంపిటిసి బండారు చంద్రపాల్ రెడ్డి.
  • ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు.

ఎంతోమంది నిరుపేదల జీవితాల్లో గరీబీ హటావో ద్వార వెలుగులు నింపిన మహానీయురాళ్లు, భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ అని మాజీ ఎంపిటిసి బండారు చంద్రపాల్ రెడ్డి పేర్కొన్నారు.నందిగామ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిట్టల రాముల ఆధ్వర్యంలో దేశ తొలి మాజీ మహిళ ప్రధానమంత్రి, స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.గాంధీ విగ్రహం వద్ద ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్ళు అర్పించారు.

ఈ సందర్భంగా నందిగామ మాజీ ఎంపీటీసీ చంద్రపాల్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరాగాంధీ గరీబీ హఠావో’, అంటే ‘పేదరికాన్ని నిర్మూలించండి’, అనే నినాదంతో పేదరిక నిర్మూలనకు ప్రత్యేకమైన దృష్టి సారించారని తెలిపారు. అందులో ఎంతోమంది నిరుపేదల జీవితాలకు వెలుగులిచ్చిన మహనీయురాలని, తన విప్లవాత్మక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన దార్శనికురాలు,భారతరత్న ఇందిరా గాంధీ అని ఆమె సేవలను కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి నివాళులర్పించారు.ఈ వేడుకల్లో షాద్ నగర్ ఏఎంసీ డైరెక్టర్ చింతలపల్లి నర్సింలు,సింగిల్ విండో డైరెక్టర్ కుందారం వెంకట్ రెడ్డి,నాయకులు ఎదిరే శ్రీకాంత్,కృష్ణారెడ్డి,కృష్ణ,లింగం,అబ్దుల్ ఘని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News