ఈ రోజు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి (Kasireddy Narayana Reddy) రాచకొండ పోలీస్ కమిషనర్ (Rachakonda Police Commissioner) జి.సుధీర్‌బాబును నేరేడ్‌మెంట్‌లోని సీపీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో(Brilliant Engineering College) జరిగిన దొంగతనాన్ని (Theft) త్వరగా ఛేదించాలని కోరారు. కేసును ట్రేస్ చేసినందుకు సీపీకి, రాచకొండ పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చట్టాన్ని, శాంతిభద్రతలను కాపాడటంలో రాచకొండ పోలీసులు నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నారని సీపీ అన్నారు.
- Advertisement -
